మార్కెట్లోకి కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. అతితక్కువ ధరకే ఈ స్పెషల్ ఫీచర్స్ కూడా...

Published : Nov 28, 2022, 06:20 PM IST
మార్కెట్లోకి కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్..  అతితక్కువ ధరకే ఈ స్పెషల్ ఫీచర్స్ కూడా...

సారాంశం

జీబ్రోనిక్స్   3 in 1 సౌండ్ డివైజ్ సౌండ్ బాంబ్ X1 బ్లాక్, బ్లూ అండ్ వైట్ కలర్స్ లో పరిచయం చేసారు. ఇయర్‌బడ్స్ ధర వచ్చేసి రూ.1,399. 

దేశీయ కంపెనీ జీబ్రోనిక్స్  కొత్త 3 ఇన్ 1 డివైస్ జీబ్రోనిక్స్  ZEB- సౌండ్ బాంబ్ X1ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్  బ్లూటూత్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, కానీ  వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్ ఇంకా ఇంటర్నల్ టార్చ్‌కు సపోర్ట్ ఉంది. బ్యాటరీకి సంబంధించి ఇయర్‌బడ్స్‌  ప్లేబ్యాక్ టైం 30 గంటల బ్యాటరీ బ్యాకప్ అని కంపెనీ పేర్కొంది. వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల ఇతర ఫీచర్లు, ధర గురించి...

 ధర 
జీబ్రోనిక్స్   3 in 1 సౌండ్ డివైజ్ సౌండ్ బాంబ్ X1 బ్లాక్, బ్లూ అండ్ వైట్ కలర్స్ లో పరిచయం చేసారు. ఇయర్‌బడ్స్ ధర వచ్చేసి రూ.1,399. ఇయర్‌బడ్‌లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ అండ్ అమెజాన్ ఇండియా నుండి కొనుగోలు చేయవచ్చు. 

ఫీచర్స్  
జీబ్రోనిక్స్   నుండి వస్తున్న ఈ కొత్త ఇయర్‌బడ్‌లు స్పష్టమైన ఆడియో క్వాలిటీ ఇస్తాయి. దీనిలో 13ఎం‌ఎం ఆడియో డ్రైవర్లకు సపోర్ట్ ఉంది. ఇంకా  కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఇచ్చారు.

అయితే 36ఎం‌ఎం డైనమిక్ డ్రైవర్‌తో బ్లూటూత్ స్పీకర్ అండ్ ఇన్‌బిల్ట్ బ్యాటరీ సపోర్ట్ తో ఎల్‌ఈ‌డి టార్చ్,   బ్లూటూత్ స్పీకర్ పవర్ ఫుల్ సౌండ్ అండ్ బేస్‌తో వస్తుంది. ఇయర్‌బడ్స్ టచ్ కంట్రోల్, ఇన్-బిల్ట్ మైక్‌కి కూడా సపోర్ట్ చేస్తాయి. ఇయర్‌బడ్‌లకి స్ప్లాష్ ప్రూఫ్ రేటింగ్ కూడా ఉంది. 

 బ్యాటరీ
ఇయర్‌బడ్‌ల బ్యాటరీకి సంబంధించి 30 గంటల బ్యాటరీ బ్యాకప్ క్లెయిమ్ చేయబడింది. బ్లూటూత్ స్పీకర్‌తో 19 గంటల వరకు ప్లేబ్యాక్ సమయం వస్తుంది. కేస్‌కి ఫాస్ట్ ఛార్జింగ్ కోసం USB-టైప్ C పోర్ట్‌ సపోర్ట్ ఉంది. ఇయర్‌బడ్‌లను స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు ఇంకా ల్యాప్‌టాప్‌లతో కూడా కనెక్ట్ చేయవచ్చు. 

PREV
click me!

Recommended Stories

Cheapest Recharge Plan : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ రీచార్జ్ ప్లాన్
Samsung Galaxy S25 Ultra పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 34,000 తగ్గిన ధర