షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్.. ఫాస్టెస్ట్ ప్రాసెసర్‌తో లాంచ్.. ఈ గొప్ప ఫీచర్లు చూడవచ్చు..

By asianet news teluguFirst Published Nov 28, 2022, 4:08 PM IST
Highlights

ఈ ఫోన్ సిరీస్‌లో రెడ్‌మీ K60, రెడ్‌మీ K60 ప్రొ, రెడ్‌మీ K60E లాంచ్ కానున్నాయి. లీక్ ప్రకారం, స్టాండర్డ్ మోడల్ రెడ్‌మి కె60 కోడ్‌నేమ్ సోక్రటీస్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. 

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమీ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సిరీస్ రెడ్‌మీ కె60ని లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ కానుంది. అయితే, కంపెనీ  దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. లీక్‌ల ప్రకారం, ఈ ఫోన్ సిరీస్‌లో రెడ్‌మీ K60, రెడ్‌మీ K60 ప్రొ, రెడ్‌మీ K60E లాంచ్ కానున్నాయి. Qualcomm  ఫాస్టెస్ట్ ప్రాసెసర్ రెడ్‌మీ K60లో  అందించవచ్చు.  రెడ్‌మీ K60Eలో డైమెన్సిటీ 8200 లేదా డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ సపోర్ట్ ఇవ్వవచ్చు.

 Kacper Skrzypek అనే Tipster రెడ్‌మీ K60 ఫ్లాగ్‌షిప్ ఫోన్ సిరీస్ గురించి సమాచారాన్ని అందించారు. లీక్ ప్రకారం, స్టాండర్డ్ మోడల్ రెడ్‌మి కె60 కోడ్‌నేమ్ సోక్రటీస్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ రెడ్‌మీ K60 Proతో లభిస్తుంది. అయితే, లేటెస్ట్ ప్రాసెసర్ సాధారణంగా హై-ఎండ్ వేరియంట్‌లతో సపోర్ట్ చేయబడుతుంది. మరోవైపు, రెడ్‌మీ K60E కోడ్‌నేమ్ Rembrandt అండ్ కంపెనీ దీనిని ఎక్స్‌ట్రీమ్ అని పిలుస్తుంది. అంటే, ఈ సిరీస్‌లో ఈ ఫోన్ అత్యంత హై-ఎండ్ ఫోన్ అవుతుంది. 

రెడ్‌మీ K60 సిరీస్ స్పెసిఫికేషన్లు
ఈ సిరీస్ తాజాగా 3C అండ్ IMEI డేటాబేస్‌లో కూడా కనిపించిందని, కొన్ని ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి. రెడ్‌మీ K60 స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే, ఫోన్‌కి 6.67-అంగుళాల డిస్ ప్లే అందుబాటులో ఉంటుంది, ఇంకా 2K రిజల్యూషన్‌తో వస్తుంది. 12జి‌బి ర్యామ్, 256జి‌బి వరకు స్టోరేజ్ సపోర్ట్ పొందుతుంది. రెడ్‌మీ K60 సిరీస్‌తో 5,500mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఫోన్‌తో 30 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇవ్వవచ్చు. ఫోన్‌లో సెక్యూరిటి కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇవ్వవచ్చు.

రెడ్‌మీ K60 సిరీస్ కెమెరా అండ్ బ్యాటరీ
రెడ్‌మీ K60 సిరీస్  కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఫోన్‌లో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తుంది.  8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఫోన్‌లో చూడవచ్చు. సెల్ఫీ అండ్ వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ కెమెరాను చూడవచ్చు. 

click me!