వెంటనే వాట్సాప్‌ డిలేట్ చేయండి లేదంటే మీ ఫోటోలు,మెసేజ్లు లీక్...: టెలిగ్రామ్ సి‌ఈ‌ఓ

By Sandra Ashok Kumar  |  First Published Nov 23, 2019, 11:38 AM IST

"మీ ఫోన్ లో ఉన్న అన్ని ఫోటోలు, సందేశాలు ఒక రోజు హ్యాక్ అవ్వోచు, మీరు మీ ఫోన్ నుండి వాట్సాప్‌ను వెంటనే డిలేట్ చేయండి" అని టెలిగ్రామ్ సి‌ఈ‌ఓ పరేల్ దురోవ్  అన్నారు.


టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పరేల్ దురోవ్ సోషల్ మీడియా వేదికపై తన పోస్ట్‌లో వాట్సాప్‌ను వెంటనే డిలేట్ చేయాలని ప్రజలను కోరారు. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్‌ వల్ల వ్యక్తి గత సమాచారం పై నిఘా పెట్టడానికి హ్యాకర్స్ ట్రోజన్ హార్స్‌ అనే స్పైని ఉపయోగిస్తారు. దాని వల్ల వారి స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్న వాట్సాప్ కాని కంటెంట్ అంటే వ్యక్తిగత ఫోటోలు, మెసేజ్లు  పబ్లిక్ అయ్యే అవకాశం ఉంది అని అన్నారు. 

"మీ వ్యక్తిగత ఫోటోలు, సందేశాలు అన్నీ ఒక రోజు పబ్లిక్‌గా లీక్ అవుతాయి. మీరు మీ ఫోన్ నుండి వెంటనే వాట్సాప్‌ను తొలగించాలి" అని దురోవ్ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉన్న తన 335,000 మంది అనుచరులకు చెప్పారు" అని  ఫోర్బ్స్ గురువారం నివేదించింది.

Latest Videos

also read స్మార్ట్‌ఫోన్‌ హ్యాకర్లకు గూగుల్ ఛాలెంజ్...గెలిస్తే 10 కోట్ల బహుమతి ఇంకా...

"ఫేస్‌బుక్ ని వాట్సాప్‌ను సొంతం చేసుకోవడానికి చాలా కాలం ముందు నిఘా కార్యక్రమాల్లో భాగంగా ఉంది. కొనుగోలు చేసిన తర్వాత కంపెనీ తన విధానాలను మారుస్తుందని అనుకోవడం అమాయకత్వం, వాట్సాప్ ను కొనుగోలు చేయకముందు నుంచే ఫేస్ బుక్ వినియోగదారుల డేటాను దొంగిలిస్తోందని ఆరోపించారు.

తన వినియోగదారుల గోప్యతను అమ్ముకున్నానని వాట్సాప్ వ్యవస్థాపకులు ఫేస్ బుక్ కు అమ్మకం సందర్భంగా చేసిన మాటలను దురోవ్ గుర్తు చేశారు.అయితే ప్రస్తుతం వాట్సాప్‌లో 1.6 బిలియన్ల యూజర్లు ఉన్నారు, టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది.

టెలిగ్రామ్ ఇప్పటివరకు వాట్సాప్ లాగా భద్రత లోపాలను కలిగి లేదు. వాట్సాప్ లాగా టేలీగ్రమ్ పై సైబర్ నేరాలు, వ్యక్తిగత సమాచారం పై భద్రత లోప్లలు లాంటివి లేవు అని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

also read  ఇక ఉబర్ క్యాబ్ లో ఏం మాట్లాడినా రికార్డు అవుతుంది...ఎలా తెలుసా ?


తాజా భద్రతా లోపం వల్ల హ్యాకర్లకు స్మార్ట్ ఫోన్ ను హ్యాకింగ్ చేయడానికి ఓ అవకాశం కల్పిస్తోంది. వాట్సాప్‌లో ఎవరైనా మీకు MP4 ఫైల్‌ను పంపినట్లయితే, మీరు దీన్ని డౌన్‌లోడ్ చేయకుండా జాగ్రత్త వహించాలి, కాబట్టి మీకు ఎవరైనా అటువంటి ఫైల్స్ పంపిస్తే మీరు వెంటనే వాటిని ఓపెన్ చేయకండి.

ఈ ప్రమాదాన్ని అత్యంత తీవ్రమైన ప్రమాదంగా వాట్సాప్ ఇప్పటికే గుర్తించింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ కూడా ధ్రువీకరించింది. వాట్సాప్ పై క్రమేపీ సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో దురోవ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

click me!