జనవరి 9వ తేదీ వరకు టెక్నో ఫాంటమ్ ఎక్స్2ని కొనుగోలు చేసిన మొదటి 100 మంది అదృష్ట కస్టమర్‌లు టెక్నో ఫాంటమ్ ఎక్స్3ని ఉచితంగా పొందుతారు. ఈ టెక్నో ఫోన్ స్టార్‌డస్ట్ గ్రే ఇంకా మూన్‌లైట్ సిల్వర్ కలర్స్ లో పరిచయం చేసారు.
చైనీస్ మాన్యుఫాక్చరర్ కంపెనీ టెక్నో ఇండియా కొత్త ఫోన్ టెక్నో ఫాంటమ్ ఎక్స్2ను ఇండియాలో లాంచ్ చేసింది. టెక్నో ఫాంటమ్ ఎక్స్2 అనేది కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫోన్, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 5జి ప్రాసెసర్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ ప్రాసెస్‌లో తయారు చేయబడింది. టెక్నో ఫాంటమ్ ఎక్స్2తో టెక్నో కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి ప్రవేశించింది.
టెక్నో ఫాంటమ్ ఎక్స్2 ధర
టెక్నో ఫాంటమ్ ఎక్స్2 ధర రూ. 39,999గా నిర్ణయించారు. ఈ టెక్నో ఫోన్ సేల్స్ అమెజాన్ అండ్ ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుండి మొదలయ్యాయి. జనవరి 9వ తేదీ వరకు టెక్నో ఫాంటమ్ ఎక్స్2ని కొనుగోలు చేసిన మొదటి 100 మంది అదృష్ట కస్టమర్‌లు టెక్నో ఫాంటమ్ ఎక్స్3ని ఉచితంగా పొందుతారు. ఈ టెక్నో ఫోన్ స్టార్‌డస్ట్ గ్రే ఇంకా మూన్‌లైట్ సిల్వర్ కలర్స్ లో పరిచయం చేసారు.
undefined
ఫీచర్స్
టెక్నో ఫాంటమ్ ఎక్స్2 డబుల్ కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లేలో వస్తుంది. ఈ ఫోన్ 6.8-అంగుళాల FHD+ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేతో పాటు P3 వైడ్ కలర్ గామట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ డిస్‌ప్లేలో సపోర్ట్ ఇచ్చారు. ఫోన్ ఫ్రేమ్ మెటల్‌తో ఉంటుంది.
టెక్నో ఫాంటమ్ ఎక్స్2 అనేది ప్రపంచంలోని మొట్టమొదటి 4nm మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఫోన్, ఈ ఫోన్ అత్యుత్తమ పర్ఫర్మెంస్ అండ్ బెస్ట్ కెమెరా అనుభవాన్ని క్లెయిమ్ చేస్తుంది. దీని క్లాక్ స్పీడ్ 3.05GHz ఉన్న ఆర్మ్ కార్టెక్స్-X2 ఉంది. ఇందులో బెస్ట్ గేమింగ్ అనుభవం కోసం హైపర్‌ఇంజిన్ 5.0 ఇచ్చారు. టెక్నో ఫాంటమ్ ఎక్స్2 115G బ్యాండ్‌లకు సపోర్ట్ ఉంది ఇంకా డ్యూయల్ సిమ్ ఆక్టివ్ గా ఉంటుంది. దీనికి 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్ ఉంది.
టెక్నో ఫాంటమ్ ఎక్స్2 కెమెరా
కెమెరా గురించి మాట్లాడితే టెక్నో ఫాంటమ్ ఎక్స్2 మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీని ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ RGBW(G+P) OIS అల్ట్రా క్లియర్ నైట్ కెమెరా సపోర్ట్ తో వస్తుంది. కెమెరా బెస్ట్ లో లైట్ ఫోటోగ్రఫీని అని పేర్కొంది. రెండవ లెన్స్ 13 మెగాపిక్సెల్స్ ఇంకా మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్. హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్, డ్యూయల్ వీడియో, వీడియో ఫిల్టర్, వీడియో HDR, 4K టైమ్ లాప్స్, 960FPS స్లో మోషన్ వంటి ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి. టెక్నో ఫాంటమ్ ఎక్స్2లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
టెక్నో ఫాంటమ్ ఎక్స్2 బ్యాటరీ
ఈ టెక్నో ఫోన్ 5160mAh బ్యాటరీతో వస్తుంది, ఇంకా 25 రోజుల స్టాండ్‌బై క్లెయిమ్ చేస్తుంది. మీరు 23 గంటల పాటు కంటిన్యూ వీడియోలను చూడవచ్చు. దీనితో 45W ఛార్జర్ వస్తుంది, దీని బ్యాటరీ కేవలం 20 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని పేర్కొంది.