సిస్కా ఎల్‌ఈడీ ఇప్పుడు తన స్మార్ట్ హోమ్ కేటగిరీ కింద సిస్కా స్మార్ట్ ట్యూబ్ లైట్ (20W)ని ప్రవేశపెట్టింది. కొత్త సిస్కా స్మార్ట్ ట్యూబ్ లైట్ ద్వారా ఎల్ఈడి లైటింగ్ టెక్నాలజీని అప్ డేట్ చేస్తుంది.ఇప్పుడు మీరు సిస్కా స్మార్ట్ హోమ్ యాప్ ఉపయోగించి మీ స్మార్ట్ ట్యూబ్ లైట్ ను బాటెన్‌ను కంట్రోల్ చేయవచ్చు.
టెక్నాలజీలో ఉత్తమ ఆవిష్కరణలతో ఎల్‌ఈడీ లైటింగ్‌లో అగ్రగామిగా ఉన్న సిస్కా ఎల్‌ఈడీ ఇప్పుడు తన స్మార్ట్ హోమ్ కేటగిరీ కింద సిస్కా స్మార్ట్ ట్యూబ్ లైట్ (20W)ని ప్రవేశపెట్టింది. కొత్త సిస్కా స్మార్ట్ ట్యూబ్ లైట్ ద్వారా ఎల్ఈడి లైటింగ్ టెక్నాలజీని అప్ డేట్ చేస్తుంది. ఇది ఒక ట్రెడిషనల్ ఎల్ఇడి లైటింగ్ ప్రాడక్ట్ అని చెప్పాలి.
రిసెర్చ్ అండ్ మార్కెట్స్ ప్రకారం ప్రపంచ ఎల్‌ఈడీ ట్యూబ్ లైట్ మార్కెట్ 2019-2024 మధ్య కాలంలో 12.2% CAGR వద్ద వృద్ధి చెందుతుందని అంచనా. ఎల్‌ఈడీ లైట్ల ద్వారా లభించే అనేక ప్రయోజనాల కారణంగా వినియోగదారులు ఎల్‌ఈడీ లైట్ల వాడకం వైపు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
also read TikTok: టిక్‌టాక్ నుంచి మరో కొత్త యాప్...
సిస్కా స్మార్ట్ ట్యూబ్ లైట్ రెండు వేరియంట్లలో వస్తుంది - ఒకటి సింగిల్ ఛానల్ (6500 కె), రెండోవది 3-ఇన్ -1 (3000 కె -4000 కె -6500 కె) ఈ రెండు వేరియంట్లు స్లిమ్ డిజైన్, కొత్త రూపాన్ని కలిగి ఉంటాయి. సిస్కా స్మార్ట్ బాటెన్ వై-ఫై ఎనేబుల్ ఫీచర్ తో సిస్కా స్మార్ట్ హోమ్ యాప్ సహాయంతో ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఈ స్మార్ట్ ట్యూబ్ లైట్ ని వినియోగదారులు ఆపరేట్ చేయవచ్చు.
ఈ వై-ఫై ఎనేబుల్ చేసిన స్మార్ట్ ట్యూబ్ లైట్లుకు 2 సంవత్సరాల పాటు వారంటీ కూడా ఉంటుంది. మీ సమయాన్ని ఆదా చేయడానికి అమెజాన్ అలెక్సా ఇంకా గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్ అసిస్టెంట్లను ఉపయోగించి కూడా దీనిని కంట్రోల్ చేయవచ్చు.
సిస్కా స్మార్ట్ ట్యూబ్ లైట్ లాంచ్ గురించి సిస్కా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురుముఖ్ ఉత్తమ్‌చందాని మాట్లాడుతూ “సిస్కా స్మార్ట్ ట్యూబ్ లైట్ ప్రారంభించడంతో భారతదేశ ట్యూబ్ లైట్ మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ లను తీసుకురావాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. వాయిస్ కంట్రోల్డ్ స్మార్ట్ ఎల్ఈడి లైట్ల కోసం డిమాండ్ పెరుగుతున్నందున మా కస్టమర్ల అవసరాలను తీర్చడానికి సిస్కా స్మార్ట్ ఉత్పత్తులను విడుదల చేస్తోంది. ఎల్‌ఈడి ప్రపంచంలో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంపై మేము దృష్టి కేంద్రీకరించాము.”
also read ఈ సంవత్సరం గూగుల్ లో ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా...?
సిస్కా స్మార్ట్ ట్యూబ్ లైట్ ఫీచర్లు:
స్లిమ్ డిజైన్ - మీరు దీన్ని మీ గదిలో, బెడ్‌రూమ్‌లలో లేదా మీ ఇంటిలో ఎక్కడైనా ఇన్‌స్టాల్ చేయవచ్చు. సిస్కా స్మార్ట్ ట్యూబ్ లైట్ స్లిమ్ డిజైన్ తో ఉంటుంది.
వై-ఫై ఫీచర్ - సిస్కా స్మార్ట్ హోమ్ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మీ ట్యూబ్ లైట్‌ను వై-ఫై ద్వారా సులభంగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ Wi-Fi రౌటర్ పరిధిలో ట్యూబ్ లైట్ ఉండేలా చూసుకోండి.
ఇన్‌స్టాల్ చేయడం సులభం - మీరు సిస్కా ఎల్‌ఇడి స్మార్ట్ బాటెన్‌ను ఇన్‌స్టాల్ చేసినప్పుడు, అల్యూమినియం హౌసింగ్, ఎల్‌ఇడి కవర్, ఎండ్ క్యాప్స్ అన్ని భాగాలు ఒకే యూనిట్ లో ఉంటాయి. అదనపు వైర్లు లాంటివి అవసరం ఉండదు.
వాయిస్ కంట్రోల్ సపోర్ట్ - మీరు సిస్కా స్మార్ట్ ట్యూబ్ లైట్‌కు ఏదైనా పేరును పెట్టుకోవచ్చు. వాయిస్ కమాండ్ల ద్వారా కమ్యూనికేట్ చేయవచ్చు. మీ సమయం ఆదా చేయడానికి మీరు మీ అన్ని స్మార్ట్ ట్యూబ్ లైట్లను ఒకే వాయిస్ కమాండ్ తో కంట్రోల్ చేయవచ్చు.
సిస్కా స్మార్ట్ ఎల్‌ఈడి లైట్ ధర రూ. 1,999 / - (సింగిల్ ఛానల్), 3-ఇన్ -1 ధర రూ .2,199 / - ప్రస్తుతం ఇది ప్రముఖ ఇ-కామర్స్ స్టోర్లలో లభిస్తుంది.