అమెజాన్ నుంచి కొత్త స్మార్ట్ టీవీ విడుదల...బడ్జెట్‌ ధరలోనే...

By Sandra Ashok KumarFirst Published Dec 12, 2019, 1:42 PM IST
Highlights

గ్లోబల్ ఈ-కామర్స్ రిటైలర్ ‘అమెజాన్’ స్మార్ట్ టీవీల రంగంలోకి అడుగు పెట్టింది. ఒనిడా భాగస్వామ్యంతో ‘ఫైర్ టీవీ ఎడిషన్’  స్మార్ట్‌టీవీని లాంచ్‌ చేసింది. దీని ధర కేవలం రూ.12,999 మాత్రమే.

ముంబై:  ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ టీవీల సెగ్మెంట్‌లోకి రంగ ప్రవేశం చేసింది. టీవీ తయారీ సంస్థ ‘ఒనిడా’తో ఇటీవల జత కట్టిన అమెజాన్‌ తాజాగా ఒక స్మార్ట్‌టీవీని విడుదల చేసింది. ‘ఒనిడా ఫైర్ టీవీ ఎడిషన్’ పేరుతో పేరిట ఒక కొత్త స్మార్ట్‌టీవీలను బడ్జెట్‌ ధరలో భారత్‌లో ఆవిష్కరించింది.

ఇండియాలో కొత్త ఒనిడీ టీవీలను లాంచ్‌ చేయడం సంతోషంగా ఉందని అమెజాన్ డివైసెస్ ఇండియా హెడ్ పరాగ్ గుప్తా తెలిపారు. తమ ఫైర్ టీవీ ఎడిషన్ అద్భుతమైన చిత్ర నాణ్యత, డాల్బీ డిజిటల్ ప్లస్, టీటీఎస్ ట్రూ సరౌండ్ సౌండ్‌తోపాటు వినియోగదారులు తమకు ఇష్టమైన అన్ని కంటెంట్‌లను ఒకే చోట ఆనందించ వచ్చన్నారు. 

also read  ఈ సంవత్సరం గూగుల్ లో ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా...?

ఫైర్ టీవీ స్టిక్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ ఈ టీవీల్లో ఇన్‌బిల్ట్‌గా అమర్చింది.  32, 43 అంగుళాల (ఫుల్‌ హెచ్‌డీ ఇంచుల డిస్‌ప్లే) సైజులలో ఇవి వినియోగదారులకు లభ్యం కానున్నాయి.  డిసెంబర్ 20వ తేదీ నుంచి అమెజాన్‌లో లభిస్తాయి. 

అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, యూట్యూబ్ తదితర స్ట్రీమింగ్ యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు.  ఇంకా 3 హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు, 1 యుఎస్‌బి పోర్ట్ ఒక ఇయర్‌ఫోన్ పోర్ట్‌లను జోడించింది. డీటీహెచ్ లేదా కేబుల్ సెట్-టాప్ బాక్స్‌లు, గేమింగ్ కన్సోల్‌లు, సౌండ్‌బార్లు,  హోమ్ థియేటర్ సిస్టమ్‌లకు అనుసంధానించవచ్చు. 

also read  నోకియా నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌....దీని ధర, ఫీచర్స్ తెలుసా ?

దీంతో స్మార్ట్‌ఫోన్‌తోపాటు టీవీల రంగంలో కూడా దూసుకు పోతున్న చైనా సంస్థ షియోమీతోపాటు నోకియా, అలాగే బడ్జెట్‌ ధరల్లో స్మార్ట్‌టీవీలను అందుబాటులో ఉంచిన మోటరోలా, టీసీఎల్‌ లాంటి కంపెనీలకు ఇవి గట్టి పోటీ ఇవ్వనున్నాయి. ఒనిడా ఫైర్ టీవీ ఎడిషన్ స్మార్ట్ టీవీల్లో 32 అంగుళాల మోడల్‌ ప్రారంభ ధర  రూ .12,999లకు, 43 అంగుళాల మోడల్‌ టీవీ ప్రారంభ ధర  రూ .21,999లకు లభ్యం కానున్నది. 

click me!