బాక్టీరియాని చంపే బల్బ్...ఎలా పనిచేస్తుందంటే... ?

By Sandra Ashok KumarFirst Published Nov 16, 2019, 2:52 PM IST
Highlights

సిస్కా కొత్త యాంటీ బాక్టీరియల్ బల్బును విడుదల చేసింది. ఈ బల్బ్ 400nm-420nm యొక్క వేవ్ లేన్త్ కాంతిని విడుదల చేస్తుంది. ఇది మన కళ్ళకు కనిపించదు, అయితే ఒక గదిలో ఉన్న బ్యాక్టీరియాను ఆ కాంతితో చంపగలదు. దీని ధర కేవలం రూ. 250.

సిస్కా గ్రూప్ కంపెనీ సిస్కా బాక్టీగ్లో పేరుతో SSK-BAB -9w బల్బ్‌ను విడుదల చేసింది. ఇది ఒక గదిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను బల్బ్ యొక్క కాంతితో   చంపేయగలదని  చెబుతున్నారు. బల్బ్ బ్యాక్టీరియాకు హాని కలిగించడానికి 400nm నుండి 420nm వరకు వేవ్ లేన్త్  కాంతిని విడుదల చేస్తుంది.

also read  ట్విట్టర్ యూటర్న్: పొలిటికల్ ప్రకటనల నిషేధంపై....

ఇది మానవ కంటికి కనిపించకుండా ఉంటుంది, అయితే దాని ఫలితంగా గదిలో ఉన్న సూక్ష్మ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది అని సిస్కా చెప్పారు.ఇది ప్రత్యేకంగా ఇండోర్ ఉపయోగం కోసం రూపొందించబడింది.

దీనిని పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య ప్రదేశాలు మరియు ఇంట్లో సులభంగా వాడుకోవచ్చు . 810 ° ల్యూమన్లతో, 9W బల్బ్ ప్రకాశవంతమైన కాంతిని అందించగలదు, ఇది పెద్ద ప్రాంతాన్ని కాంతిమయంగా మరియు వోల్టేజ్ హెచ్చుతగ్గులు గుర్తించగలదు.

also read జియో సెన్సేషన్: ఐయూసీపై జాప్యంతో చౌక సేవలు కష్టమే

అయితే ఈ బల్బ్ రెండు మోడ్‌లతో వస్తుంది. ఇక్కడ లైటింగ్ ప్లస్ యాంటీ బాక్టీరియల్ మోడ్ లేదా యాంటీ బాక్టీరియల్ మోడ్‌ను ఎంచుకోవచ్చు. సిస్కా యొక్క బాక్టీగ్లో ప్రకారం, అస్పెర్‌గిల్లస్ నైజర్, బాసిల్లస్ సెరస్, ఎస్చెరిచియా కోలి, స్టెఫిలోకాకస్ ఆరస్, ఈస్ట్, హానికరమైన జెర్మ్స్ మరియు బ్యాక్టీరియా యొక్క  ఎలక్ట్రోక్యూటింగ్‌లో నిరూపించబడింది.

click me!