స్నాప్‌చాట్ యాప్ న్యూ లెన్స్ అనే టైమ్ మెషిన్ ఫీచర్ని యాప్ లో ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులు తమ చిన్న వయస్సు నుండి పెద్ద వయస్సులోకి మారితే ఎలా ఉంటారో చూడటానికి అనుమతిస్తుంది.
స్నాప్‌చాట్ టైమ్ మెషిన్ అనే కొత్త లెన్స్‌ను జతచేసింది. ఇది వినియోగదారులు తమ చిన్న వయస్సు నుండి పెద్ద వయస్సు వరకు ఎలా ఉంటారో చూసుకోవడానికి అనుమతిస్తుంది.ఇంతకుముందు స్నాప్‌చాట్ లో జెండర్ లెన్స్ వైరల్ అయ్యింది.
స్నాప్‌చాట్ సంస్థ సొంత పెట్టుబడిదారుల నివేదిక ప్రకారం జూన్ 30, 2019 తో ముగిసిన రెండవ త్రైమాసికంలో రోజువారీ ఆక్టివ్ వినియోగదారుల సంఖ్య 203 మిలియన్లకు పెరిగింది అని తెలిపింది.స్నాప్‌చాట్‌లో వినియోగదారుడి ఫోటో లేదా వీడియోపై ఫిల్టర్ల ఫీచర్లను వాడుకోవడానికి లెన్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) పై ఆధారపడుతుంది.
also read అఫోర్డబుల్ ఫ్లాగ్ షిప్ ఫోన్ రియల్‌మీ ‘ఎక్స్2 ప్రో’
ఇవి బన్నీ ఇయర్స్ నుండి ముఖంపై చిన్న చిన్న మచ్చలు, పూల దండతో పాటు స్కిన్ టోన్ ను రకరకాల ఫిల్టర్ ఆప్షన్ లోకి మీ ముఖాన్ని మారుస్తాయి. అటువంటి లెన్స్‌లను రూపొందించడానికి అధునాతన టెక్నాలజి శిక్షణాపై ఆధారపడుతుందని స్నాప్‌చాట్ తెలిపింది.
క్రొత్త టైమ్ మెషిన్ లెన్స్ వినియోగదారులు తమను తాము సున్నితమైన చర్మం ఇంకా చబ్బీ బుగ్గలు, చిన్న వయస్సు వ్యక్తిలగా నుండి పెద్ద వయస్సు వ్యక్తిలగా ఎలా ఉంటారో చూసుకోవడానికి అనుమతిస్తుంది.లెన్స్‌లో స్లైడర్ బార్ కూడా ఉంది ఇది వినియోగదారులు తమ వయస్సును ఎక్కువ లేదా తక్కువగా ఉంటే ఎలా ఉంటారో చూడటానికి లాగవచ్చు.
also read బీఎస్ఎన్ఎల్ @ దాదాపు 78 వేల మంది...దరఖాస్తు
ఈ లెన్స్ సెల్ఫీ మరియు బ్యాక్ కెమెరా రెండింటిలోనూ పనిచేస్తుంది.ఇంతకుముందు ఫేస్ఆప్ అనే యాప్ వైరల్ అయ్యింది. ఇది ఫిల్టర్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా వినియోగదారులు తాము నచ్చిన వయస్సు లోకి మీ ముఖాన్ని మార్చుకోవటానికి ఈ వెర్షన్ అనుమతించడానికి AI ని ఉపయోగించారు. యాప్ దాని ప్రైవసీ విధానంపై కొంత వివాదాన్ని కూడా ఎదుర్కొంది.
స్నాప్‌చాట్ iOSలో అయితే ఐఫోన్ 6 దాని తరువాత మోడల్ లో ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. ఆండ్రాయిడ్ OS అయితే గెలాక్సీ ఎస్ 10, ఎస్ 10 +, ఎస్ 9, ఎస్ 9 +, గెలాక్సీ ఎ 70, హువావే పి 20 ప్రో, హువావే వై 7, హువావే వై 9, షియోమి రెడ్‌మి నోట్ 7, వన్‌ప్లస్ 6 టి మరియు పిక్సెల్ 3ఎ ఫోన్లలో సపోర్ట్ చేస్తుంది.