ఫ్లిప్‌కార్ట్‌లో చెప్పులు ఆర్డర్ చేస్తే ఎప్పుడు వచ్చాయో తెలుసా.. కస్టమర్ షాక్!

Published : Jul 02, 2024, 09:10 AM IST
 ఫ్లిప్‌కార్ట్‌లో చెప్పులు ఆర్డర్ చేస్తే ఎప్పుడు వచ్చాయో తెలుసా.. కస్టమర్ షాక్!

సారాంశం

సరిగ్గా ఆరేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న చెప్పులు ఇప్పుడు  కస్టమర్‌కు చేరాయి. దీనికి సంబంధించిన స్క్రిన్ షాట్ Xలో వైరల్ అవుతుంది. 

ముంబై: ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసిన చెప్పులు ఆరేళ్ల తర్వాత కస్టమర్‌కు చేరాయి. అయితే ముంబై నివాసి అహ్సాన్ ఖర్బాయికి ఫ్లిప్‌కార్ట్ సిబ్బంది నుండి ఓ కాల్ వచ్చింది. సార్ మీ పార్శిల్ వచ్చింది అని డెలివరీ బాయ్ చెప్పడంతో అహ్సాన్ షాక్ అయ్యాడు. విషయం ఏంటంటే అహ్సాన్ ఆరేళ్ల క్రితం బుక్ చేసుకున్న ఆర్డర్ సంగతి కూడా మర్చిపోయాడు. 

Ahsan Xలో ఆరేళ్ల తర్వాత వచ్చిన ఆర్డర్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేను ఆరేళ్ల క్రితం బుక్ చేసుకున్న చెప్పులు  ఇప్పుడు వచ్చాయి అహ్సాన్ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్‌పై ఫ్లిప్‌కార్ట్ కూడా స్పందించింది. 

మీకు కలిగిన  ఈ అనుభవానికి  మేము క్షమాపణలు కోరుతున్నాము. మా సిబ్బంది త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు. మేము మీ లేటెస్ట్  ఆర్డర్‌పై చెక్ చేస్తాము. మీ సహనానికి మేము అభినందిస్తున్నాము" అని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అహ్సాన్ ట్వీట్‌కి నెటిజన్లు కూడా స్పందించారు, మీ ఆర్డర్ చాలా త్వరగా వచ్చింది, కాదా ? అని మరొకరు ఆర్డర్ చేసేటప్పుడు మీరు ఎవరిని సంప్రదించారు ? అని ఇంకా నేను ఈ రోజు ఆర్డర్ చేసాను. ఇప్పుడు నేను ఆందోళన చెందుతున్నాను అని కామెంట్స్  చేసారు. 

 

PREV
click me!

Recommended Stories

Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే
మీ ఫోన్ లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే వాట్సాప్ హ్యాక్ అయినట్లే, ఈ టైమ్ లో ఏం చేయాలి?