ఇకపై మీ ఫోన్ నంబర్ ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు.. వాట్సాప్ సూపర్ అప్ డేట్!

By Ashok Kumar  |  First Published Jun 29, 2024, 10:58 AM IST

 కాంటాక్ట్‌లను షేర్ చేసుకోవడానికి వాట్సాప్ స్మార్ట్ మార్గాన్ని పరిచయం చేసింది. దీని సహాయంతో యూజర్లు  నంబర్స్ చెప్పకుండా ఈజీగా  కాంటాక్ట్స్  షేర్ చేయవచ్చు.


ఇకపై క్యూఆర్ కోడ్‌తో వాట్సాప్ కాంటాక్ట్స్ షేర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి వాట్సాప్ అప్‌డేట్‌లను కూడా విడుదల చేసింది. కాంటాక్ట్స్ షేర్ చేసుకోవడానికి వాట్సాప్ స్మార్ట్ మార్గాన్ని పరిచయం చేసింది. దీని సహాయంతో యూజర్లు నంబర్స్ చెప్పకుండా ఈజీగా  కాంటాక్ట్స్  షేర్ చేయవచ్చు. ఇందుకు WhatsApp  ఒక అప్షన్ కూడా అందిస్తుంది. అదే స్మార్ట్ వాట్సాప్ కాంటాక్ట్ షేరింగ్ ఆప్షన్. దీని సహాయంతో యూజర్లు ఇతరులతో కాంటాక్ట్స్ షేర్  చేసుకోవచ్చు. అలాగే, ఈ ఫీచర్ యూజర్ల ప్రైవసీ కూడా పెంచడానికి సహాయపడుతుంది. అంటే మరెవరూ కాంటాక్ట్స్ వివరాలను పొందలేరు.

ఇందుకోసం ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. ఒకవేళ మీ వాట్సాప్ అప్‌డేట్ కాకపోతే, మీరు దానిని ఆపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుండి అప్ డేట్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు సెటింగ్స్  అప్షన్ వెళ్లాలి. ప్రొఫైల్ ఫోటో కుడి వైపు పైన మీరు QR కోడ్ స్కానర్ కోసం ఒక అప్షన్ చూస్తారు దానిపై నొక్కండి, అది కొత్త పేజీని ఓపెన్ చేస్తుంది. దీని తర్వాత మీరు ఎవరితోనైనా QR కోడ్‌ను షేర్ చేసుకోవచ్చు. QR కోడ్‌ని షేర్ చేయడానికి షేరింగ్ ఆప్షన్ కుడి పైన మూలలో కనిపిస్తుంది.

Latest Videos

దానిపై నొక్కిన తర్వాత, మీరు ఎవరితో షేర్  చేయాలనుకుంటున్నారో వారితో మీరు కాంటాక్ట్స్ షేర్ చేయవచ్చు. వాట్సాప్ ఇంతకుముందు కూడా ఒక కొత్త అప్‌డేట్ విడుదల చేసింది, దీని సహాయంతో HD ఫోటోలు, వీడియోలను  ఆటోమాటిక్ గా షేర్ చేయవచ్చు. ముందుగా ఫోటోలు,  వీడియోలను షేర్ చేయడానికి మీరు ఫోటోలు & వీడియోలు పంపాలనుకుంటున్న క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే క్వాలిటీ  ఒకసారి సెట్ చేస్తే మళ్లీ మళ్లీ సెలక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.  

click me!