మెటా కంపెనీ లేటెస్ట్ AI ఫీచర్ Meta AIని ఇండియాలోకి తీసుకొచ్చింది. Meta AIని Instagram, Facebook & WhatsAppలో ఉపయోగించవచ్చు. Meta AI డైలీ ట్యాక్స్, లేర్నిగ్స్, క్రియేటివిటీ వర్క్స్ యూజర్లకు సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అని పిలువబడే కృత్రిమ మేధస్సు టెక్నాలజీ నేటి అత్యాధునిక శాస్త్రీయ ప్రపంచంలో ఎన్నో చిక్కులతో ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్‌ని మనిషిలా ఆలోచించేలా లేదా మనిషిలాగా ప్రవర్తించేలా చేస్తుంది. వివిధ ప్రముఖ టెక్నాలజీ సంస్థలు కూడా AI ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేస్తున్నాయి.
అదే విధంగా మెటా కంపెనీ లేటెస్ట్ AI ఫీచర్ Meta AIని ఇండియాలోకి తీసుకొచ్చింది. Meta AIని Instagram, Facebook & WhatsAppలో ఉపయోగించవచ్చు. Meta AI డైలీ ట్యాక్స్, లేర్నిగ్స్, క్రియేటివిటీ వర్క్స్ యూజర్లకు సహాయపడుతుందని కంపెనీ తెలిపింది. లామా(Llama) 3 టెక్నాలజీతో ఆధారితమైన Meta AI గత ఏప్రిల్ నుండి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లోని యూజర్లకు కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
undefined
WhatsAppలో Meta AIని ఎలా ఉపయోగించాలి?
Meta AIని నేరుగా ఆక్సెస్ చేయడానికి, మీ WhatsApp యాప్‌ను అప్‌డేట్ చేసి ఓపెన్ చేయండి. ఇప్పుడు నీలం కలర్లో గుండ్రటి సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. Meta AI చాట్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు కావాల్సిన ప్రశ్నలు ఇంకా సమాచారం గురించి తెలుసుకోవచ్చు. మీరు తెలుసుకోవాలనుకునే పదాన్ని టైప్ చేయండి, ఉదాహరణకు మీరు భారతదేశంలోని టాప్ 10 కాలేజీల గురించి తెలుసుకోవాలనుకుంటే, భారతదేశంలోని టాప్ 10 కాలేజెస్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు సమాధానం లభిస్తుంది.
Meta AIలో యూజర్స్ క్రియేట్ చేయడానికి "ఇమాజిన్" అనే ప్రత్యేక ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా వారి చాట్స్ నుండి నేరుగా AI రూపొందించిన ఫోటోస్ చేయవచ్చు. Meta AIతో "ఇమాజిన్" అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా, మీరు కొన్ని విషయాలను క్రియేట్ చేయవచ్చు. బర్త్ డే పార్టీల వంటి ఈవెంట్‌ల కోసం పర్సనలైజెడ్ ఇన్విటేషన్స్ క్రియేట్ చేయడం ఇంకా హోమ్ డెకరేషన్స్ కోసం మూడ్ బోర్డ్స్ రూపొందించడం వంటివి ఇందులో ఉన్నాయి.
వాట్సాప్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లలో కూడా Meta AI ఇంగ్లీష్‌లో కూడా ఉంది. దీనిని Meta.ai వెబ్‌సైట్ ద్వారా కూడా ఆక్సెస్ చేయవచ్చు. ఈ చాట్‌బాట్ US, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఉగాండా & జింబాబ్వేతో సహా 12 దేశాల్లో ప్రారంభించారు.