శాంసంగ్‌ నుంచి మరో స్మార్ట్ బడ్జెట్ ఫోన్...

By Sandra Ashok Kumar  |  First Published Dec 18, 2019, 4:46 PM IST

శాంసంగ్‌ గెలాక్సీ A01 ధర ఇంకా దాని లభ్యత వివరాలను ఇంకా ప్రకటించలేదు. సంస్థ తన అధికారిక  వెబ్ సైట్‌లో స్పెసిఫికేషన్లు ఇంకా డిజైన్‌ను వెల్లడించింది. అయితే  మొదట ఆన్ లైన్ ద్వారాన లేక ఆఫ్ లైన్ ద్వారాన  ఎలా విడుదల చేస్తుందో తెలియదు. 


దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్‌ కొత్త బడ్జెట్ ఫోన్ గెలాక్సీ ఎ01 ను అధికారికంగా ప్రకటించారు. ఈ బడ్జెట్ ఫోన్ ధరల వివరాలు ఇప్పటికీ అధికారికంగా వెల్లడించనప్పటికి, శాంసంగ్‌ ఈ ఫోన్‌ను తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.ఈ ఫోన్ వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్, వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ A01  ఫీచర్స్ 5.7-అంగుళాల HD + ఇన్ఫినిటీ-వి డిస్ ప్లే , 2GB RAM, స్టోరేజ్ కోసం ప్రత్యేకమైన మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్, 3,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది మూడు కలర్లలో అందుబాటులోకి రానుంది.శాంసంగ్‌ గెలాక్సీ A01 ధర ఇంకా దాని లభ్యత వివరాలను ఇంకా ప్రకటించలేదు.

Latest Videos

also read  కొత్త సోలార్ పవర్ హెడ్‌ఫోన్స్...ఒక్కసారి చార్జ్ చేస్తే 3 రోజులవరకు..

సంస్థ తన అధికారిక  వెబ్ సైట్‌లో స్పెసిఫికేషన్లు ఇంకా డిజైన్‌ను వెల్లడించింది. అయితే  మొదట ఆన్ లైన్ ద్వారాన లేక ఆఫ్ లైన్ ద్వారాన  ఎలా విడుదల చేస్తుందో తెలియదు. ఫోన్ బ్లాక్, బ్లూ అండ్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.శాంసంగ్‌ గెలాక్సీ A01 స్క్రీన్  ఇన్ఫినిటీ-వి డిస్ ప్లే ను కలిగి ఉంటుంది.

వెనుక వైపున ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్ సెన్సార్ల క్రింద  ఫ్లాష్‌ కూడా ఉంది. పవర్ బటన్ స్క్రీన్ చివరికి, వాల్యూమ్ బటన్లు ఎడమ వైపు ఉంటాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో లేదు.

also read కాల్స్‌పై ఆరు పైసల చార్జీ...జనవరి నుంచి రద్దు...

శాంసంగ్‌ గెలాక్సీ A01 ఫీచర్స్

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, కంపెనీ శాంసంగ్‌ గెలాక్సీ A01 పూర్తి వివరాలను జాబితా చేయలేదు వాటిలో ముఖ్యమైన ఫీచర్స్ మాత్రమే వెల్లడించారు. ఈ ఫోన్ 5.7-అంగుళాల HD + ఇన్ఫినిటీ-వి డిస్ ప్లే తో, ఆక్టా-కోర్ (క్వాడ్ 1.95 GHz + క్వాడ్ 1.45 GHz) ప్రొసెసర్, ఫోన్ 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, స్టోరేజ్ ఎక్స్‌పాన్షన్ కోసం మైక్రో ఎస్‌డీ కార్డ్ ఫీచర్స్ ఉన్నాయి.


శాంసంగ్‌ గెలాక్సీ ఎ01 వెనుక భాగంలో ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫోన్ ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. శామ్సంగ్ గెలాక్సీ A01 3,000mAh బ్యాటరీ, డ్యూయల్ సిమ్ (నానో + నానో) స్లాట్‌లకు సపోర్ట్ చేస్తుంది. FM రేడియోతో,  ప్రోక్సిమిటి  సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్ ఉన్నాయి. 

click me!