కొత్త ఏడాదిలో శామ్సంగ్ మొదటి 5జి ఫోన్‌.. 50ఎం‌పి కెమెరాతో ఫోన్ తో అందిస్తున్న ఫీచర్లు ఇవే..

By asianet news telugu  |  First Published Jan 6, 2023, 4:22 PM IST

స్యామ్సంగ్ గెలాక్సీ A14 5జి సిల్వర్, మెరూన్, నలుపు అండ్ ఆకుపచ్చ రంగులలో పరిచయం చేసారు.  64 GB స్టోరేజ్ వేరియంట్ ధర $ 199.99 అంటే సుమారు రూ. 16,500. హ్యాండ్‌సెట్ స్యామ్సంగ్ US వెబ్‌సైట్‌లో లిస్ట్ చేయబడింది.


స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ స్యామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జిని లాంచ్ చేసింది. ఈ ఫోన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2023) కంటే ముందే పరిచయం చేశారు. ఫోన్ లాంచ్ కాకముందే లీక్స్ వచ్చాయి, ఇప్పుడు దీనిని అమెరికాలో ప్రవేశపెట్టారు. గెలాక్సీ A14 5జి 2023లో వస్తున్న శాంసంగ్ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్, ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో అందిస్తున్నారు. ఈ ఫోన్ కి 6.6 అంగుళాల పి‌ఎల్‌ఎస్ ఎల్‌సి‌డి డిస్ ప్లే ఉంది. ఇంకా త్వరలో భారతదేశంలో కూడా లాంచ్ కానుంది.

ధర
స్యామ్సంగ్ గెలాక్సీ A14 5జి సిల్వర్, మెరూన్, నలుపు అండ్ ఆకుపచ్చ రంగులలో పరిచయం చేసారు.  64 GB స్టోరేజ్ వేరియంట్ ధర $ 199.99 అంటే సుమారు రూ. 16,500. హ్యాండ్‌సెట్ స్యామ్సంగ్ US వెబ్‌సైట్‌లో లిస్ట్ చేయబడింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో ఫోన్ తాజాగా కనిపించింది. అంతేకాదు ఈ ఫోన్‌ను త్వరలో భారత్‌లో కూడా లాంచ్ చేయవచ్చు. 

Latest Videos

స్పెసిఫికేషన్లు
స్యామ్సంగ్ గెలాక్సీ A14 5జి  అండ్రాయిడ్ 13 ఆధారిత వన్ UI 5.0తో వస్తుంది.  ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో (1,080x2,408 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌, 6.6-అంగుళాల PLS LCD డిస్‌ప్లే ఉంది. ఇంకా 64జి‌బి స్టోరేజ్ ఉంది, మైక్రో ఎస్‌డి స్లాట్ సహాయంతో 1టి‌బి వరకు పెంచుకోవచ్చు.

కెమెరా అండ్ బ్యాటరీ
స్యామ్సంగ్ గెలాక్సీ A14 5జి కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 50 మెగాపిక్సెల్ f/1.8 ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ f/2.4 మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ f/2.4 డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు అండ్ వీడియో కాల్స్ కోసం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా  ఉంది. 

ఫోన్‌లో  కనెక్టివిటీ గురించి మాట్లాడుతూ ఇందులో Wi-Fi, బ్లూటూత్ 5.2, ఎన్‌ఎఫ్‌సి అండ్ USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ స్యామ్సంగ్ ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 
 

click me!