ఇక అక్కడ సిమ్ కొనలంటే ఫేస్ స్కాన్ తప్పనిసరి...

By Sandra Ashok Kumar  |  First Published Dec 5, 2019, 3:41 PM IST

సెప్టెంబరు నెలలో చైనా సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ "ఆన్‌లైన్ వినియోగదారుల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించడం" పై నోటీసు జారీ చేసింది. టెలికం వినియోగదారులు ఇక పై నిజమైన పేరు, ముఖం నమోదును అమలు చేయడానికి నియమాలను రూపొందించింది.


చైనా బీజింగ్ లోని అవుట్‌లెట్లలో వినియోగదారులు కొత్త సిమ్ తిసుకునేటప్పుడు టెలికాం ఆపరేటర్లు ఫేస్ స్కాన్‌లను సేకరించాలని చైనా ప్రభుత్వం ఇటివలే ఓ నోటీసు జారీ చేసింది.సెప్టెంబరు నెలలో చైనా సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ "ఆన్‌లైన్ వినియోగదారుల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించడం" పై నోటీసు జారీ చేసింది.

also read  బెస్ట్ కెమెరా​ ఫోన్​ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ స్మార్ట్​ఫోన్లపై ఓ లూక్కెయండి...

Latest Videos

undefined

టెలికం వినియోగదారులు ఇక పై నిజమైన పేరు, ముఖం నమోదును అమలు చేయడానికి నియమాలను రూపొందించింది. కొత్త ఫోన్ నంబర్ తీసుకున్నప్పుడు ప్రజల గుర్తింపు కార్డును ఇస్తుంటారు కానీ చైనాలో అక్కడి ప్రభుత్వం ఇకపై  ఎవరైనా కొత్త సిమ్ తిసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతిక మార్గాలను ఉపయోగించాలని జారీ చేసిన నోటీసులో పేర్కొంది.

చైనా యునికామ్ కస్టమర్ సేవా ప్రతినిధి AFPకి డిసెంబర్ 1 నుండి "పోర్ట్రెయిట్ మ్యాచింగ్"  అంటే కొత్త ఫోన్ నంబర్ కోసం నమోదు చేసుకున్న కస్టమర్లు తమ ముఖాన్ని స్కాన్ చేసి రికార్డ్ చేయవలసి ఉంటుంది.రెండవ దశలలో దీనిపై పర్యవేక్షణ, తనిఖీలు కూడా చేపట్టనున్నారు. ఫోన్ వినియోగదారుల కోసం వారి అసలు పేరును రిజిస్ట్రేషన్ చేసుకునేల ప్రభుత్వం టెలికాం ఆపరేటర్లను ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది" అని ఆ నోటీసులో తెలిపింది.

also read  అమెజాన్ స్మార్ట్ స్పీకర్‌...11గంటల వరకు నాన్ స్టాప్ మ్యూజిక్

2013 నుండి చైనా ప్రభుత్వం  ఫోన్ వినియోగదారుల కోసం రియల్-నేమ్ రిజిస్ట్రేషన్ చేయాలని ముందుకు వచ్చినప్పటికీ దీనిపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.చైనీస్ ఆన్‌లైన్  సోషల్ మీడియా వినియోగదారులు డిసెంబర్ 1 నుంచి ముఖ తప్పనిసరి అని జారీ నోటీసుపై విమర్శలు చేశారు. దీని వల్ల వారి బయోమెట్రిక్ డేటా లీక్ కావచ్చు అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

click me!