5G In India: ఈ నెలలోనే జియో 5జి.. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటాము: అంబానీ

By asianet news telugu  |  First Published Aug 2, 2022, 1:50 PM IST

కేవలం ఆరేళ్ల క్రితం లాంచ్ అయిన జియో అతిపెద్ద 4G నెట్‌వర్క్ రోల్ అవుట్ సమయంలో అతి తక్కువ వ్యవధిలో  పలు ప్రపంచ రికార్డులను సృష్టించింది.  జియో 4G నెట్‌వర్క్  అత్యున్నత నాణ్యత, అత్యంత బడ్జెట్ డిజిటల్ సేవలను 400 మిలియన్లకు పైగా విశ్వసనీయమైన కస్టమర్లకు అందిస్తుంది. 
 


ముంబై: భారతదేశపు అతిపెద్ద డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్  జియో 700MHz, 800MHz, 1800MHz, 3300MHz అండ్ 26GHz బ్యాండ్‌లలో స్పెక్ట్రంని గెలుచుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, భారత ప్రభుత్వం ఈ వేలం నిర్వహించింది. ఈ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకునే హక్కును పొందడం ద్వారా జియో లేటెస్ట్ 5G నెట్‌వర్క్  నిర్మించడానికి వీలు కల్పిస్తుంది. 

కేవలం ఆరేళ్ల క్రితం లాంచ్ అయిన జియో అతిపెద్ద 4G నెట్‌వర్క్ రోల్ అవుట్ సమయంలో అతి తక్కువ వ్యవధిలో  పలు ప్రపంచ రికార్డులను సృష్టించింది.  జియో 4G నెట్‌వర్క్  అత్యున్నత నాణ్యత, అత్యంత బడ్జెట్ డిజిటల్ సేవలను 400 మిలియన్లకు పైగా విశ్వసనీయమైన కస్టమర్లకు అందిస్తుంది. 

Latest Videos

undefined

5G వేలం మొత్తం 1,50,173 కోట్ల రూపాయలకు జరిగింది, ఇందులో Jio ఒక్కటే 88,078 కోట్ల స్పెక్ట్రమ్‌ని కొనుగోలు చేసింది, అంటే స్పెక్ట్రమ్‌లో 50 శాతానికి పైగా Jio ఆక్రమించుకుంది. 5G స్పెక్ట్రమ్ కింద 51236 Mhz స్పెక్ట్రమ్ వేలం వేయబడింది. స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అత్యధిక బిడ్‌ను గెలుచుకుంది. రిలయన్స్ మొత్తం 24,740Mhz స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. రిలయన్స్ 700Mhz, 800Mhz, 1800Mhz, 3300Mhz, 26Ghz స్పెక్ట్రమ్ కోసం బిడ్‌లు వేసింది. ఫ్యూచర్ టెక్నాలజి స్వీకరించడంలో, వాటిని అన్‌లాక్ చేయడంలో Jio ముందు ఉంది. 

ఆగస్టు 15న  జియో  5G నెట్‌వర్క్ 
దేశంలో 5జీ నెట్‌వర్క్ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే రిలయన్స్ జియో కస్టమర్లకు 5Gని బహుమతిగా ఇవ్వనుందని భావిస్తున్నారు. జియో  5G సర్వీస్ ఆగస్టు 15న ప్రారంభించనుంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ 5G లాంచ్‌తో ఆజాదీ అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పారు. Jio 22 సర్కిల్‌లకు 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది.

అంబానీ ఒక ప్రకటనలో, “కొత్త టెక్నాలజి  అవలంబించడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే ప్రధాన ఆర్థిక శక్తిగా మారుతుందని మేము నమ్ముతున్నాము. ఈ దార్శనికత, విశ్వాసమే జియోకు జన్మనిచ్చింది. Jio 4G రోల్‌అవుట్  వేగం, స్థాయి అండ్ సామాజిక ప్రభావం ప్రపంచంలో సాటిలేనిది. ఇప్పుడు భారతదేశంలో 5G సాంకేతికతలో అగ్రగామిగా ఉండటానికి Jio సిద్ధంగా ఉంది.

 "మేము భారతదేశం అంతటా 5G రోల్‌అవుట్‌తో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటాము. జియో ప్రపంచ స్థాయి, బడ్జెట్ 5G సేవలను అందించడానికి కట్టుబడి ఉంది. మేము భారతదేశం  డిజిటల్ విప్లవాన్ని నడిపించే సేవలు, ప్లాట్‌ఫారమ్‌లు, సోల్యూషన్స్ అందిస్తాము, ముఖ్యంగా విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, తయారీ, ఇ-గవర్నెన్స్ వంటి కీలక రంగాలలో. ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా మిషన్‌ను సాకారం చేయడంలో ఇది మాకు గర్వకారణం. 

జియో  5G ప్రతి భారతీయుని అవసరానికి అనుగుణంగా ఉంటుంది. జియోకి  దేశవ్యాప్తంగా ఫైబర్ ఉన్నందున తక్కువ వ్యవధిలో 5G రోల్ అవుట్‌కు పూర్తిగా సిద్ధంగా ఉంది.

 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలులో ఎయిర్‌టెల్
5జీ స్పెక్ట్రమ్ వేలం ముగిసింది. ఇందులో జియో అత్యధిక స్పెక్ట్రమ్‌ను గెలుచుకుంది. తరువాత భారతీ ఎయిర్‌టెల్ పేరు రెండవ స్థానంలో ఉంది. భారతి ఎయిర్‌టెల్ 19867Mhz స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. మరోవైపు  Vodafone-Idea 6228Mhz స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. గౌతమ్ అదానీ డేటా నెట్‌వర్క్, టెలికమ్యూనికేషన్స్ ప్రపంచంలోకి మొదటిసారిగా అడుగుపెట్టింది, 26Ghz ఎయిర్‌వేవ్ స్పెక్ట్రమ్ కోసం బిడ్డింగ్ ద్వారా 400Mhz స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది.

click me!