యూట్యూబ్ అద్భుతమైన అప్‌డేట్‌.. వాటిని కూడా ఎడిట్ చేయవచ్చు.. ప్రత్యేకత ఏమిటంటే..

By asianet news teluguFirst Published Jul 30, 2022, 1:05 PM IST
Highlights

ఈ ఫీచర్‌ను ప్రకటిస్తూ, యూట్యూబ్ ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు  డివైజ్‌లో ఉన్న లాంగ్ వీడియోలను 60 సెకన్ల షార్ట్‌గా మార్చుకోవచ్చని తెలిపింది.

ఇప్పుడు మీరు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌లో అద్భుతమైన ఫీచర్‌ రాబోతుంది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు లాంగ్ వీడియోలను కూడా ఎడిట్ చేయవచ్చు. నిజానికి, YouTube లాంగ్ వీడియోలను YouTube షార్ట్‌లుగా మార్చడానికి ఎడిటింగ్ టూల్ తీసుకురాబోతోంది. ఈ టూల్ ఆండ్రాయిడ్ అండ్ iOS రెండింటిలో అందుబాటులో ఉంటుంది. YouTube ఈ కొత్త ఫీచర్‌కి ఎడిట్‌ ఇన్ టు షార్ట్‌గా పేరు పెట్టింది. 


ఈ ఫీచర్‌ని ప్రకటిస్తూ యూట్యూబ్ ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు  డివైజ్‌లో ఉన్న లాంగ్ యూట్యూబ్ వీడియోలను 60 సెకన్ల షార్ట్‌గా మార్చుకోవచ్చని తెలిపింది. ఈ ఫీచర్‌తో యుజర్లు ఫోన్ గ్యాలరీలోని టెక్స్ట్, ఫిల్టర్‌లు, వీడియోలు ఇంకా ఫోటోలను షార్ట్‌లకు జోడించవచ్చు. యూట్యూబ్ ప్రకారం ఈ అప్‌డేట్ వినియోగదారులు వారి క్లాసిక్ కంటెంట్‌ను పునరుద్ధరించడానికి ఇంకా వీడియో స్ట్రీమింగ్ అనుభవాన్ని మార్చడానికి అనుమతిస్తుంది అలాగే యూజర్ల సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. 

యూట్యూబ్ ప్రకారం, వినియోగదారులు ఈ ఫీచర్‌ను ఉపయోగించి వీడియోలను  షూట్ చేయవచ్చు. అయితే వినియోగదారులు  స్వంత వీడియోలను షాట్లలో మాత్రమే ఎడిట్ చేయవచ్చు. కానీ ఇతర వీడియో క్రియేటర్స్ వీడియోలను ఎడిట్ చేయలేరు. వీడియో నుండి రూపొందించిన షార్ట్‌కి మొత్తం వీడియో కూడా లింక్ చేయబడుతుంది, తద్వారా షార్ట్‌ను చూసే వ్యూవర్స్ ఒరిజినల్ వీడియోను కూడా చూడగలరు.

ప్రతి నెలా 1.5 బిలియన్ల కంటే ఎక్కువ మంది యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నారు. యూట్యూబ్ షార్ట్‌ల వ్యూవర్స్ గురించి మాట్లాడితే యూట్యూబ్ షార్ట్‌లను రోజుకు 3 బిలియన్ల మంది అంటే 30 కోట్ల  సార్లు వీక్షిస్తున్నారు. యూట్యూబ్ భారతదేశంలోనే 467 మిలియన్ల మంది యూట్యూబ్ వీడియోలను వీక్షిస్తున్నారు. 

click me!