World Wide Web day: WWWకి 33 ఏళ్లు, దీని చరిత్రకు సంబంధించిన కొన్ని విషయాలు మీకోసం..

By asianet news teluguFirst Published Aug 1, 2022, 4:20 PM IST
Highlights

WWWకి ఆగష్టు 1వ తేదీతో అంటే నేటికి 33 సంవత్సరాలు నిండింది. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ వెబ్ డేగా జరుపుకుంటారు.  వరల్డ్ వైడ్ వెబ్ చరిత్ర, దానికి సంబంధించిన వాస్తవాల గురించి మీకోసం..

డిజిటల్ కాలంలో దాదాపు అందరికీ వరల్డ్ వైడ్ వెబ్ అంటే WWW అనే పదం తెలిసే ఉంటుంది. WWWకి ఆగష్టు 1వ తేదీతో అంటే నేటికి 33 సంవత్సరాలు నిండింది. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ వెబ్ డేగా జరుపుకుంటారు. వరల్డ్ వైడ్ వెబ్‌ను 1989లో కంప్యూటర్ సైంటిస్ట్ టిమ్ బెర్నర్స్-లీ రూపొందించారు. అప్పటి నుండి ఇది ఇంటర్నెట్  మొత్తం రూపాన్ని మార్చింది.

మీరు కూడా వరల్డ్ వైడ్ వెబ్ గురించి, వరల్డ్ వైడ్ వెబ్ చరిత్ర, దానికి సంబంధించిన సరదా వాస్తవాల గురించి తెలుసుకుందాం...

వరల్డ్ వైడ్ వెబ్ ఎలా పుట్టింది?
1989లో టిమ్ బెర్నర్స్ లీ (35) యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (CERN)లో సహ పరిశోధకుడిగా పనిచేశాడు. లీ ఇక్కడ ఒక కంప్యూటర్ సిస్టమ్ సమాచారాన్ని మరొక కంప్యూటర్‌కు పంపేవాడు. ఈ సమయంలో సమాచారం అంతా ఒకే చోట లభ్యమయ్యేలా మార్గం ఎందుకు ఉండకూడదని ఆలోచించాడు.

దీని తర్వాత, లీ ఇదే అంశంపై 'ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ - ఎ ప్రపోజల్' పేరుతో పరిశోధనా పేపర్ సిద్ధం చేశారు. దీని తర్వాత మొదటి వెబ్ పేజీ బ్రౌజర్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ పుట్టింది. టిమ్ బెర్నర్స్ లీ వరల్డ్ వైడ్ వెబ్  కి ఫాధర్ అయ్యాడు. 

వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏమిటి?
వరల్డ్ వైడ్ వెబ్‌ను WWW అని కూడా పిలుస్తారు. మీరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అంటే ఇంటర్నెట్‌లోని బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసే మొత్తం డేటా వరల్డ్ వైడ్ వెబ్‌లో వస్తుంది. కంప్యూటర్ పరిభాషలో, వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఆన్‌లైన్ కంటెంట్ లేదా ఇంటర్నెట్ కంటెంట్  హైపర్‌టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ (HTML) నెట్‌వర్క్, ఇది హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ (HTTP) ద్వారా యాక్సెస్ చేయబడుతుంది. 

ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ మధ్య తేడా ఏమిటి?
చాలా మంది ఇంటర్నెట్ ఇంకా వరల్డ్ వైడ్ వెబ్ ఒకే విషయంగా భావిస్తారు, కానీ అది నిజం కాదు. వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఆన్‌లైన్ పేజీల గ్రూప్, అయితే ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్‌లు, డివైజెస్ కనెక్ట్ చేయబడిన భారీ నెట్‌వర్క్. అంటే, ఇంటర్నెట్ ఒక పెద్ద వేదిక ఇంకా వరల్డ్ వైడ్ వెబ్ ఈ ప్లాట్‌ఫారమ్‌లో డేటాను అందిస్తుంది.
 

click me!