
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ రిలయన్స్ డిజిటల్ సమ్మర్ సీజన్‌లో గ్యాడ్జెట్స్ అండ్ ఆక్సెసిరిస్ పై ఆకర్షనీయమైన డీల్స్ అందజేస్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డిజిటల్ డిస్కౌంట్ డేస్‌ను లాంచ్ చేసింది.
ఐఫోన్‌ల నుండి ఐప్యాడ్‌ల వరకు, ఎయిర్ కండిషనర్ల నుండి రిఫ్రిజిరేటర్‌ల వరకు షాపింగ్ ప్రియులు డిస్కౌంట్‌లతో ఆనందాన్ని పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది, కస్టమర్లకు కోరుకున్న వస్తువులను ఆశించిన ధరలకు పొందేందుకు మంచి అవకాశం కల్పిస్తుంది.
లేటెస్ట్ ఆపిల్ గ్యాడ్జెట్స్ చూసే వారికి రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్స్ ఉన్నాయి. కొత్త ఐఫోన్ పై రూ.12,000 వరకు డబుల్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. ఇంకా Apple MacBook M1 మోడల్‌పై ధర 33% తగ్గించింది. అంతే కాదు కస్టమర్‌లు కేవలం రూ. 54 నుండి నో-కాస్ట్ EMIని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, iPad 9th Gen Wi-Fi 64GB మోడల్ ఈ ప్రత్యేక సేల్ పిరియడ్ లో రూ. 23,900 తగ్గింపు ధరతో లభిస్తుంది.
అయితే ఈ డిస్కౌంట్లు ఇక్కడీతో ఆగవు. ACలు, రిఫ్రిజిరేటర్‌లు ఆండ్ వాషింగ్ మెషీన్‌లపై డిజిటల్ డిస్కౌంట్ డేస్ డీల్స్ అందిస్తుంది. 1-టన్ను 3-స్టార్ ఇన్వర్టర్ AC నమ్మలేని ధరకే అందుబాటులో ఉంది, దీని ధర కేవలం రూ. 20,990. హై-ఎండ్ వాషర్ అండ్ డ్రైయర్ అవసరం ఉన్నవారికి ప్రీమియం 11 కిలోలు / 7 కిలోల మోడల్ డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 61,990కే మీ సొంతం చేసుకోవచ్చు. ఇంకా, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్‌ను రూ. 49,990 తగ్గింపు ధరకే కోనవచ్చు, ఈ వేసవిలో కూల్ గా ఉండటానికి ఇదే సరైనది.
LG స్మార్ట్ టీవీలు 45% తగ్గింపుతో అందిస్తున్నారు, శామ్‌సంగ్ నియో QLED టీవీలు రూ. 79,990 నుండి ప్రారంభమవుతాయి. మంచి ఆడియో అనుభూతిని కోరుకునే వారి కోసం రిలయన్స్ డిజిటల్ మీకు డాల్బీ అట్మాస్ సౌండ్ బార్‌లపై 65% వరకు తగ్గింపును అలాగే బోస్ సౌండ్‌బార్ 900పై 30% తగ్గింపును అందిస్తుంది.
అంతేకాదు కస్టమర్‌లు ప్రముఖ బ్యాంక్ కార్డ్‌లపై 10% తక్షణ తగ్గింపు అలాగే క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.