మీరు సినిమాలు, వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు Netflixలో పర్సనలైజెడ్ రికమెండేషన్స్ వస్తుంటాయి. మీరు 'థమ్స్ అప్' లేదా 'థమ్స్ డౌన్' అని రేట్ చేస్తే అది మీ ప్రాధాన్యతలను బాగా అర్థం చేసుకుంటుంది ఇంకా అలాంటి కంటెంట్‌ను సూచిస్తుంది.
ఆన్ లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో ఇప్పుడు పాపులర్ OTT ప్లాట్‌ఫారమ్. చాలా మంది యూజర్లు తమకు ఇష్టమైన సినిమాలు, వెబ్ సిరీస్లను ఇక్కడే చూస్తుంటారు. అయితే, దీన్ని చాలా కస్టమైజ్ చేయవచ్చని చాలా మందికి తెలియదు. ఈ నెట్‌ఫ్లిక్స్ ఫీచర్‌లు మీ స్ట్రీమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి కూడా...
మీరు తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన Netflix ఫీచర్లు ఇంకా వాటిని ఎలా ఉపయోగించాలంటే..?
undefined
1. కస్టమైజ్
మీరు సినిమాలు, వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు Netflixలో పర్సనలైజెడ్ రికమెండేషన్స్ వస్తుంటాయి. మీరు 'థమ్స్ అప్' లేదా 'థమ్స్ డౌన్' అని రేట్ చేస్తే అది మీ ప్రాధాన్యతలను బాగా అర్థం చేసుకుంటుంది ఇంకా అలాంటి కంటెంట్‌ను సూచిస్తుంది. Netflix మీ రికమెండేషన్స్ మరింత మెరుగ్గా చేయడానికి 'డబుల్ థంబ్స్ అప్' అప్షన్ కూడా అందిస్తుంది. మీరు ఇష్టపడే కంటెంట్ ఆధారంగా మరిన్ని రికమెండేషన్స్ చేయడంలో మీకు సహాయపడుతుంది. మీరు భవిష్యత్తులో చూడాలనుకుంటున్న సినిమాలు అండ్ సిరీస్‌లను 'మై లిస్ట్'కి యాడ్ చేయడం ద్వారా వాటి క్యూరేటెడ్ లిస్ట్ కూడా సృష్టించవచ్చు.
2. సెర్చ్ బార్
హోమ్ పేజీలోని సెర్చ్ బార్ మీ అవసరాలకు అనుగుణంగా కంటెంట్‌ను గుర్తించడానికి బాగా పని చేస్తుంది. ఉదాహరణకు, 'నెట్‌ఫ్లిక్స్'లో టైప్ చేయడం వల్ల నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ టైటిల్స్ కనిపిస్తాయి. మీ ప్రాధాన్యత ప్రకారం సబ్ టైటిల్స్ అండ్ ఆడియో లాంగ్వేజెస్, టీవీ ప్రోగ్రామ్స్, మూవీస్ కోసం బ్రౌజ్ చేయండి.
3. మీ ప్రొఫైల్ నుండి టైటిల్స్ హైడ్ చేయడం
మీరు ఇష్టపడే సినిమా అలవాట్లను ఇతరులు చూస్తారేమో అని మీరు ఆందోళన చెందితే మీ నెట్‌ఫ్లిక్స్ వ్యూ హిస్టరీలో మీరు చూసిన షోలు అండ్ సినిమాలను మీరు తొలగించవచ్చు లేదా హైడ్ చేయవచ్చు.
4. మీ డేటా వినియోగాన్ని కంట్రోల్ చేయడం
Netflix మొబైల్ యాప్ మీ సెల్యులార్ డేటా యూసేజ్ సెట్టింగ్‌ని మార్చుకోవడానికి అనుమతిస్తుంది. మీరు ఓన్లీ వై-ఫై, లో-మీడియం- హై అండ్ ఆన్ లిమిటెడ్ అప్షన్స్ నుండి మీకు అనుకూలమైన వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ కానప్పుడు మాత్రమే Wi-Fi మిమ్మల్ని స్ట్రీమింగ్ నుండి దూరంగా ఉంచుతుంది.
5. అన్ని కంప్యూటర్ షార్ట్‌కట్స్ తెలుసుకోండి
*ఈ ఐదు కీబోర్డ్ షార్ట్ కట్స్ నెట్‌ఫ్లిక్స్‌ను ప్రో లాగా నావిగేట్ చేయడంలో మీకు సహాయపడతాయి.
*F మీకు ఫుల్ స్క్రీన్‌ని అందిస్తుంది; Esc మిమ్మల్ని ఎగ్జిట్ (exit) తీసుకువెళుతుంది.
*PgDn పాజ్ అవుతుంది, PgUp ప్లే అవుతుంది.
*Spacebar కూడా పాజ్ అండ్ ప్లే చేస్తుంది.
*Shift + కుడి బాణం ముందుకు(forward); Shift + ఎడమ బాణం రివైండ్ అవుతుంది.
*మీ కంప్యూటర్‌ని బట్టి M మ్యూట్ చేస్తుంది.