అప్పుడు నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు డిస్నీ.. ఇక జూన్ నుంచి నో ఛాన్స్..

By Ashok kumar SandraFirst Published Apr 6, 2024, 7:46 PM IST
Highlights

OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ పాస్‌వర్డ్ షేరింగ్‌ని నిషేధించింది. ఇంతకుముందు ఈ ఫీచర్ నెట్‌ఫ్లిక్స్‌లో నిలిపివేయబడింది. అప్పటి నుండి, నెట్‌ఫ్లిక్స్ యూజర్లలో పెరుగుదల కనిపించింది. 
 

 పాపులర్ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ హాట్ స్టార్ యూజర్  పాస్‌వార్డ్స్  షేరింగ్ నిషేధించింది. తాజాగా కంపెనీ ఈ కొత్త పాలసీని రూపొందించింది. పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఈ చర్య జూన్‌ నుండి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఒక యూజర్ తన పాస్‌వర్డ్‌ను ఇతరులతో షేర్ చేసుకోలేరు. ఈ విధానాన్ని తీసుకొచ్చేనందుకే  కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటికే ఈ రూల్స్

పాస్‌వర్డ్ షేరింగ్ గతంలో OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో లిమిట్  చేయబడింది. నెట్‌ఫ్లిక్స్ గతేడాది ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీని తర్వాత, నెట్‌ఫ్లిక్స్‌లో యూజర్ల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పుడు డిస్నీ కూడా అదే బాటలో పయనిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, జూన్ నుండి పాస్‌వర్డ్ షేరింగ్ నిలిపివేయబడుతుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఈ విధానాన్ని అనుసరిస్తున్నందున, డిస్నీ కూడా ఇదే పాలసీతో వస్తోంది.

డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్
డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్ ఒక ఈవెంట్ సందర్భంగా పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని ప్రకటించారు. ఇందుకోసం సంస్థ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. మొదట్లో ఇలా కొన్ని దేశాల్లో మాత్రమే వర్తిస్తుంది. సెప్టెంబర్ 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా పాస్‌వర్డ్ షేరింగ్  నిషేధం నిబంధనలను అమలు చేయాలని కంపెనీ కోరుకుంటోంది.

జూన్‌ నుండి ప్రారంభం

డిస్నీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హ్యూ జాన్‌స్టన్ అకౌంట్  షేరింగ్‌పై అనుమానం ఉంటే, సైన్ అప్ చేయడానికి కంపెనీ ప్రాంప్ట్‌ను అందజేస్తుందని వెల్లడించారు. మా బెస్ట్ కంటెంట్‌ని వీలైనన్ని ఎక్కువ మంది వీక్షకులకు తీసుకెళ్లాలనుకుంటున్నాం అని చెప్పారు.

click me!