ఐఫోన్ కెమెరా లాంటి లుక్ తో రెడ్‌మీ కొత్త ఎడిషన్: తక్కువ ధరకే 12జి‌బి ర్యామ్ ఇంకా బెస్ట్ ఫీచర్లు కూడా..

By asianet news telugu  |  First Published Dec 28, 2022, 2:26 PM IST

రెడ్‌మి నోట్ 12 ప్రో స్పీడ్ ఎడిషన్ షిమ్మర్ గ్రీన్, టైమ్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు. ఈ ఫోన్ మూడు స్టోరేజీలలో వస్తుంది. 128జి‌బి స్టోరేజ్‌తో దీని 6 జి‌బి ర్యామ్ ధర CNY 1,699 అంటే దాదాపు రూ. 20,000.


స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 12 ప్రో స్పీడ్ ఎడిషన్‌ను  పరిచయం  చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో విడుదలైంది. రెడ్‌మీ నోట్  12 ప్రొ స్పీడ్ ఎడిషన్‌లో 6.67-అంగుళాల పంచ్ హోల్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఫోన్‌లో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 778జి ప్రాసెసర్, 12జి‌బి వరకు ర్యామ్ ఉంది. రెడ్‌మి నోట్ 12 ప్రో స్పీడ్ ఎడిషన్ రెడ్‌మి 12 సిరీస్‌లో నాల్గవ ఫోన్. ఇంతకుముందు ప్రో, ప్రో ప్లస్ ఇంకా డిస్కవరీ ఎడిషన్ వేరియంట్‌లను విడుదల చేశారు. రెడ్‌మి నోట్ 12 ప్రో స్పీడ్ ఎడిషన్ ఇతర స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం...

రెడ్‌మీ నోట్ 12 ప్రో స్పీడ్ ఎడిషన్ ధర 
రెడ్‌మి నోట్ 12 ప్రో స్పీడ్ ఎడిషన్ షిమ్మర్ గ్రీన్, టైమ్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు. ఈ ఫోన్ మూడు స్టోరేజీలలో వస్తుంది. 128జి‌బి స్టోరేజ్‌తో దీని 6 జి‌బి ర్యామ్ ధర CNY 1,699 అంటే దాదాపు రూ. 20,000, 256 జి‌బి స్టోరేజ్‌తో 8 జి‌బి ర్యామ్  ధర CNY 1,799 అంటే దాదాపు రూ. 21,300.  రెడ్‌మి నోట్ 12 ప్రో స్పీడ్ ఎడిషన్ 12 జిబి ర్యామ్‌తో 256 జిబి స్టోరేజ్ ధర 1,999 చైనీస్ యువాన్‌అంటే  దాదాపు రూ. 23,741. 

Latest Videos

 స్పెసిఫికేషన్‌లు
రెడ్‌మి నోట్ 12 ప్రో స్పీడ్ ఎడిషన్ లో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ పంచ్ హోల్ AMOLED డిస్‌ప్లే ఉంది, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 900 నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్, HDR10+ డిస్ ప్లేతో సపోర్ట్ చేసారు. ఫోన్‌లో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్, గరిష్టంగా 12జి‌బి వరకు ర్యామ్ తో 256జి‌బి వరకు స్టోరేజ్ ఉంది. ఫోన్‌లో సెక్యూరిటి కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ 12 MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్‌లో లభిస్తుంది. 

 కెమెరా అండ్ బ్యాటరీ లైఫ్ 
ఫోన్ కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 108ఎం‌పి  స్యామ్సంగ్ HM2 ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ లో 5,000 mAh బ్యాటరీ ఉంది, ఇంకా 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం ఫోన్ USB-C పోర్ట్, 3.5ఎం‌ఎం హెడ్‌ఫోన్ జాక్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్‌కు సపోర్ట్ చేస్తుంది. 

click me!