త్వరలో స్మార్ట్ ఫోన్స్ మరింత పవర్ ఫుల్.. క్వాల్కమ్ నుండి కొత్త ప్రాసెసర్.. ఫీచర్లు, పనితీరు అదుర్స్..

By asianet news telugu  |  First Published Nov 16, 2022, 1:54 PM IST

కొత్త ప్రాసెసర్‌తో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1తో పోలిస్తే 35 శాతం వరకు బెస్ట్ పర్ఫర్మెంస్ కనిపిస్తుంది. క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 జి‌పి‌యూ సి‌పి‌యూ రెండూ మెరుగుపర్చింది. ఇంకా పాత జనరేషన్ కంటే 25 శాతం వేగంగా పని చేస్తుందని కంపెనీ పేర్కొంది.


సెమీ కండక్టర్ కంపెనీ క్వాల్ కం అత్యంత పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2ని ఈ సంవత్సరం టెక్ సమ్మిట్-2022లో లాంచ్ చేసింది. కంపెనీ దీనిని స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 అండ్ 8+ జెన్ 1 అప్‌గ్రేడ్ వెర్షన్‌లో పరిచయం చేసింది. గత ప్రాసెసర్‌తో పోలిస్తే ఈ ప్రాసెసర్‌లో చాలా విషయాలు మెరుగుపర్చింది. కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్‌తో అప్‌గ్రేడ్ చేసిన సి‌పి‌యూ, ఇంకా కొత్త Kyro CPU డిజైన్ (1+4+3)తో వస్తుంది. అలాగే ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 4ఎన్‌ఎం ప్రాసెస్ నోడ్‌లో పనిచేస్తుంది. 

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఫీచర్లు
కొత్త ప్రాసెసర్‌తో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1తో పోలిస్తే 35 శాతం వరకు బెస్ట్ పర్ఫర్మెంస్ కనిపిస్తుంది. క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 జి‌పి‌యూ సి‌పి‌యూ రెండూ మెరుగుపర్చింది. ఇంకా పాత జనరేషన్ కంటే 25 శాతం వేగంగా పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. దీనితో పాటు Adreno 740 GPU సపోర్ట్ కూడా ఉంది, అంటే 40 శాతం తక్కువ బ్యాటరీని వినియోగిస్తుంది. కొత్త కైరో CPU డిజైన్ (1 + 4 + 3) ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది, ఇందులో 1 ప్రైమ్ కోర్, 4 గోల్డ్ కోర్లు అండ్ 3 ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నాయి. క్వాల్ కం కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఇతర ఫీచర్స్ గురించి మాట్లాడితే, Wi-Fi 7, బ్లూటూత్ v5.3, సింగిల్ కోర్‌లో 3.2GHz వరకు క్లాక్ స్పీడ్‌ పొందుతుంది. 

Latest Videos

undefined

గేమింగ్ అనుభవం
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 గేమింగ్ అనుభవాన్ని అలాగే హార్డ్‌వేర్ పనితీరును మెరుగుపరచడానికి రే-ట్రేసింగ్ ఫీచర్‌  ఉంది, అంటే గేమింగ్ సమయంలో  రియల్ లైఫ్ ఎక్స్పిరియన్స్ అందిస్తుంది. Nvidia  AI INT4 ఫార్మాట్‌కు సపోర్ట్ తో కొత్త ప్రాసెసర్ మొదటి మొబైల్ ప్రాసెసర్ అని కంపెనీ పేర్కొంది. ఈ ప్రాసెసర్ పనితీరును 60 శాతం వరకు పెంచుతుంది.  

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2: కెమెరా పనితీరు 
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2తో కూడా హై క్వాలిటీ ఫోటోగ్రఫీకి సపోర్ట్ ఉంది. ప్రాసెసర్ 200MP వరకు స్యామ్సంగ్ ISOCELL HP3 సెన్సార్, సోని హెచ్‌డి‌ఆర్ టెక్నాలజీ ఆధారిత సెన్సార్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ AV1 వీడియో కోడెక్‌ను 8K HDR వీడియోలను 60FPS వరకు ప్లే చేయడానికి, క్యాప్చర్ చేయడానికి అనుమతిస్తుంది. 

ఈ ఫోన్లలో కొత్త ప్రాసెసర్
ఒప్పో ఫైన్ద్ X6 ఫ్లాగ్‌షిప్ సిరీస్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2తో వస్తున్న మొదటి ఫోన్ అని చెప్తున్నారు. మరోవైపు ఈ ప్రాసెసర్‌తో వస్తున్న ఇతర స్మార్ట్‌ఫోన్‌ల గురించి మాట్లాడితే వివో X90 సిరీస్, iQOO 11 సిరీస్, వన్ ప్లస్ 11 సిరీస్, స్యామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్‌లను Qualcomm కొత్త ప్రాసెసర్‌తో పరిచయం చేయవచ్చు. 

click me!