బ్లూ టిక్స్ కోసం పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను విడుదల చేయడం ట్విట్టర్‌లోని అతిపెద్ద మార్పులలో ఒకటి. అయితే ఈ ప్రోగ్రామ్ మొదట బాట్‌ల అక్కౌంట్ అండ్ ట్రోల్‌లను ఆపడానికి తీసుకువచ్చారు, అయితే ఈ ప్రోగ్రామ్ తప్పుడు ఇంకా నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగింబడుతుంది.
టెస్లా సిఈఓ ఎలోన్ మస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన తర్వాత కంపెనీని "ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ సమాచార వనరు"గా మార్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతేకాదు ఇందుకు అతను ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి చాలా పెద్ద మార్పులు కూడా చేసాడు, అయితే ఈ మార్పులు అతని లక్ష్యం వైపు వెళ్ళడం లేదని భావిస్తున్నారు. బ్లూ టిక్స్ కోసం పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను విడుదల చేయడం ట్విట్టర్‌లోని అతిపెద్ద మార్పులలో ఒకటి.
అయితే ఈ ప్రోగ్రామ్ మొదట బాట్‌ల అక్కౌంట్ అండ్ ట్రోల్‌లను ఆపడానికి తీసుకువచ్చారు, అయితే ఈ ప్రోగ్రామ్ తప్పుడు ఇంకా నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగింబడుతుంది. దీంతో ఇప్పుడు ట్విట్టర్‌లో నకిలీ ఖాతాలను గుర్తించడం మరింత కష్టమైన పనిగా మారింది. కొన్ని పద్ధతుల సహాయంతో మీరు నకిలీ ఖాతాలను సులభంగా గుర్తించవచ్చు...
undefined
1. వెరిఫై వివరాలను చెక్ చేయండి
ట్విట్టర్ లో అక్కౌంట్ పేరు, అక్కౌంట్ క్రియేట్ చేసిన తేదీ, ఫాలోవర్స్ చూడండి. అక్కౌంట్ ఎవరు ఫాలో అవుతున్నారో కూడా చెక్ చేయండి
2. బ్లూ టిక్ పెయిడ్ అండ్ వేరిఫైడ్ చేయబడిందా ?
వెరిఫికేషన్ తర్వాత బ్లూ టిక్ వచ్చిందా లేదా చెక్ చేయండి. మీరు అక్కౌంట్ వివరాలలో ఈ సమాచారాన్ని చూస్తారు. మీరు అక్కౌంట్ పాప్-అప్‌లో "ఈ అక్కౌంట్ Twitter బ్లూకు సబ్ స్క్రైబ్ పొందినందున వేరిఫైడ్ చేయబడింది" అని చూస్తే ఈ అక్కౌంట్ బ్లూ టిక్ పెయిడ్ అని అర్థం. అక్కౌంట్ లో "ఈ అక్కౌంట్ వేరిఫైడ్" అని ఉంటే ఈ అక్కౌంట్ వేరిఫైడ్ చేయబడిందని అర్ధం.
3. లాజిక్ చెక్
ఇతర వెబ్‌సైట్‌లు, ప్లాట్‌ఫారమ్‌లలో పబ్లిక్ ఇంకా ప్రభుత్వ సంస్థల ట్విట్టర్ ప్రొఫైల్‌లను చెక్ చేయండి. మరోవైపు ట్విట్టర్ అక్కౌంట్ నుండి రెచ్చగొట్టే, అసభ్యకరమైన పోస్ట్‌లు షేర్ చేసినట్లు ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ అక్కౌంట్ నకిలీ కావచ్చు.
4. ప్రొఫైల్ URL
మీరు ట్విట్టర్ లో ట్వీట్ చూసినపుడు దాని ప్రొఫైల్ URL చూడండి. ప్రొఫైల్ చూస్తున్నప్పుడు బయో పైన ఉన్న మొదటి ఇంకా చివరి పేర్లు ప్రొఫైల్ URLతో సంబంధం ఉండకపోతే, అది నకిలీ అక్కౌంట్ కావచ్చు.
5. బయో వివరాలు
జర్నలిస్టుల వంటి వెరిఫై చేయబడిన అక్కౌంట్ యూజర్లు చాలా మంది మీడియా కంపెనీ అండ్ ఇంతకు ముందు పనిచేసిన మీడియా సంస్థ సమాచారాన్ని కూడా షేర్ చేస్తుంటారు. అదేవిధంగా చాలా మంది సెలబ్రిటీలు వారి వెబ్‌సైట్‌ను, ఇలాంటి సంబంధిత సమాచారాన్ని కూడా షేర్ చేస్తారు. నిజమైన ట్విట్టర్ అక్కౌంట్ గుర్తించడానికి ఇది సులభమైన మార్గం.