ట్విట్టర్‌లో గూగుల్ పేపై విమర్శలు.. ఈ యాప్ పూర్తిగా పనికిరాదు అంటూ ట్వీట్.. ఏం జరిగిందంటే..?

By asianet news telugu  |  First Published Nov 15, 2022, 3:18 PM IST

 గూగుల్ పే ప్రారంభ రోజుల్లో ఆన్‌లైన్‌లో యూ‌పి‌ఐ పేమెంట్స్ చేయడంపై యూజర్లకు క్యాష్‌బ్యాక్ ఇచ్చేది, కానీ ఇప్పుడు రివార్డ్‌ల రూపంలో వివిధ డీల్‌లపై డిస్కౌంట్లు అందిస్తుంది. దీంతో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) యాప్ గూగుల్ పే ట్విట్టర్‌లో భారీ విమర్శలను ఎదుర్కొంటోంది. యూజర్లు ట్విట్టర్‌లో #GPayతో ట్విట్స్ చేస్తున్నారు. గూగుల్ పే ఇప్పుడు పూర్తిగా పనికిరానిదిగా మారిందని యూజర్లు అంటు పోస్ట్ చేస్తున్నారు. నిజానికి  గూగుల్ పే మల్టీ స్క్రాచ్ కార్డ్‌లపై క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుండేది, ఇందులో యూజర్లు క్యాష్ ప్రైజ్ పొందుతారు ఇంకా క్యాష్ నేరుగా యూజర్ అక్కౌంట్ కు ట్రాన్సఫర్ చేసేది. అయితే, ఇప్పుడు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ అండ్ స్క్రాచ్ కార్డ్ పై గూగుల్ పే విమర్శల బారిన పడింది. #GPay ట్విట్టర్‌లో ఎందుకు ట్రెండింగ్‌లో ఉందో, ప్రజలు దీనిని "పూర్తిగా పనికిరాని యాప్" అని ఎందుకు పిలుస్తున్నారంటే...

 గూగుల్ పే ప్రారంభ రోజుల్లో ఆన్‌లైన్‌లో యూ‌పి‌ఐ పేమెంట్స్ చేయడంపై యూజర్లకు క్యాష్‌బ్యాక్ ఇచ్చేది, కానీ ఇప్పుడు రివార్డ్‌ల రూపంలో వివిధ డీల్‌లపై డిస్కౌంట్లు అందిస్తుంది. దీంతో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఒకటి లేదా రెండు స్క్రాచ్ కార్డ్‌లపై తప్పకుండ క్యాష్‌బ్యాక్ ఉండేదని, అయితే ఇప్పుడు 10-20 స్క్రాచ్‌ కార్డ్‌లు కూడా డీల్స్‌పై మాత్రమే యూజర్లకు ఆఫర్స్ అందించబడుతున్నాయని యూజర్లు చెబుతున్నారు. యూజర్లు పాత క్యాష్‌బ్యాక్ స్క్రాచ్ కార్డ్‌లు, ప్రస్తుత డీల్స్ స్క్రాచ్ కార్డ్‌లను పోల్చుతు స్క్రీన్‌షాట్‌లను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

Latest Videos

undefined

ట్విట్టర్‌లోని ఒక యూజర్ #GPay అంటూ  ట్వీట్ చేస్తూ - ప్రజలను పిచ్చిగా మార్చడానికి ఇదో ఎంత గొప్ప మార్గం, ప్రజలను ప్రయోజనంగా మార్చుకుంటున్నారు #GPay ప్రజలను మోసం చేయడానికి ఇది మంచి ఉపాయం.... వారు కేవలం ప్రయోజనాన్ని పొందుతారు pic.twitter.com/LoOg3v5MDH అని అన్నారు.

మరో ట్విట్టర్ యూజర్  పాత గూగుల్ పే క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఇంకా ప్రస్తుత GPay రివార్డ్‌లను పోల్చి చూపుతూ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. ఇంతకుముందు ఆన్‌లైన్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్ రూపంలో కొంత డబ్బును కంపెనీ మా  ఖాతాలో వేసేదని, కానీ ఇప్పుడు రివార్డ్‌లుగా బిర్యానీ, డ్రై ఫ్రూట్స్ లేదా బట్టలు కొనుగోలు చేయడంపై తగ్గింపు, మొబైల్ రీఛార్జ్ ఆఫర్‌లు ఉన్నాయని ఈ ట్వీట్ ద్వారా స్పష్టమైంది అని అన్నారు.

అమెరికన్ టెక్ కంపెనీ గూగుల్ ఈ పేమెంట్ యాప్‌ను సెప్టెంబర్ 2017లో ప్రారంభించింది. అయితే అప్పుడు ఈ యాప్ పేరు తేజ్ యాప్. ప్రారంభంలో కంపెనీ చెల్లింపుపై వినియోగదారులకు యాప్‌ను షేర్ చేయడంపై రూ. 11, రూ. 15, రూ. 100 వరకు క్యాష్‌బ్యాక్‌లను అందించేది. ఇప్పుడు కంపెనీ క్యాష్‌బ్యాక్‌కు బదులుగా వివిధ బ్రాండ్‌ల షాపింగ్, రీఛార్జ్‌పై డీల్స్ అండ్ డిస్కౌంట్లను రివార్డ్‌లుగా అందిస్తోంది. 

click me!