ఎట్టకేలకు నిరీక్షణ తర్వాత గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6a) లాంచ్ అయింది. సంస్థ వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ Google I/O సందర్భంగా గూగుల్ ఈ మొబైల్ విడుదల చేసింది. గూగుల్ సొంత టెన్సర్ ప్రాసెసర్ (Tensor Processor ) ఈ మొబైల్‌లో ఉంటుంది. టైటాన్ ఎం2 సెక్యూరిటీ కంప్రెజర్ కూడా ఉంటుంది. మంచి స్పెసిఫికేషన్లతో ఆకర్షణీయైన ధరతో ఈ పిక్సెల్ 6ఏను గూగుల్ తీసుకొచ్చింది.
గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ గత నెలలో గూగుల్ ఐ/వో సదస్సులో లాంచ్ అయింది.ఇందులో టెన్సార్ ప్రాసెసర్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌లను అందించారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు, ముందువైపు ఒక కెమెరా ఉంది. వీటికి ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని గూగుల్ అప్పుడే ప్రకటించింది.
గూగుల్ పిక్సెల్ 6ఏ ధర (అంచనా)
అమెరికాలో దీని ధరను 449 డాలర్లుగా (సుమారు రూ.34,800) నిర్ణయించారు. చాక్, చార్‌కోల్, సేజ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా పిక్సెల్ ఫోన్లు అమెరికా కంటే ఎక్కువ ధరకే మనదేశంలో లాంచ్ అవుతాయి. కాబట్టి దీని ధర రూ.40 వేల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.
గూగుల్ పిక్సెల్ 6ఏ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 6ఏ పనిచేయనుంది. 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆక్టాకోర్ గూగుల్ టెన్సార్ చిప్‌సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కోప్రాసెసర్లను గూగుల్ అందించింది.
ఇక కెమెరా విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12.2 మెగాపిక్సెల్ కాగా... 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ అందించలేదు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4410 ఎంఏహెచ్ కాగా... ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.