Xiaomi Level Up Sale: త‌క్కువ ధ‌ర‌లో ల్యాప్‌టాప్‌లు.. షియోమీ 'Level Up' సేల్‌‌లో భారీ డిస్కౌంట్స్..!

By team telugu  |  First Published Jun 12, 2022, 12:56 PM IST

షియోమీ Redmi ల్యాప్‌టాప్‌లపై లెవెల్ అప్ సేల్‌ను ప్రకటించింది. జూన్ 8 నుంచి ప్రారంభమైన ఈ సేల్ జూన్ 17 వరకు కొనసాగుతుంది. ఇక ల్యాప్‌టాప్‌లపై  లభించే ఆఫర్‌ల జాబితాను ఇప్పుడు చూద్దాం.
 


మూడు నెలల వ్యవధిలో తన స్మార్ట్ హోమ్ ఉత్పత్తులపై రెండవ రౌండ్ సేల్‌ను ప్రకటించిన Xiaomi. తాజాగా Redmi ల్యాప్‌టాప్‌లపై బంఫర్ ఆఫర్‌ను ప్రకటించింది. 'Level Up' సేల్‌తో వినియోగదారులకు మంచి ఆపర్స్‌ను అందిస్తుంది . జూన్ 8 నుండి ప్రారంభమైన ఈ సేల్ జూన్ 17 వరకు కొనసాగుతుంది. ఎప్పటిలాగే ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్‌లు, డీల్‌లు ప్రత్యేక తగ్గింపులు లభిస్తున్నాయి. HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు రూ. 4,500 వరకు అదనపు తగ్గింపులతో పాటు తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI ఆఫర్‌లు ఉన్నాయి. Xiaomi స్వంత స్టోర్‌తో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన Amazon, Flipkartలో కూడా ఈ సేల్ అందుబాటులో ఉంది.

Xiaomi లెవెల్ అప్ సేల్‌లో Redmi Book Pro ల్యాప్‌టాప్‌పై భారీ తగ్గింపు లభిస్తున్నాయి, ఈ ల్యాప్‌టాప్‌ 11th generation, ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 8GB RAM ,512GB SSD స్టోరేజితో అందుబాటులో ఉంది. ల్యాప్‌టాప్ ధర రూ. 59,999 అయితే భారత్‌లో దిన్ని రూ.49,999కి విక్రయిస్తున్నారు. ఇక సేల్‌లో ల్యాప్‌టాప్ మరింత తగ్గింపు లభిస్తోంది. దాదాపు రూ. 7,000 డిస్కౌంట్‌లో ఈ ల్యాప్‌టాప్‌ను పొందవచ్చు. దీంతో వీటి ధర రూ. 42,999 గా ఉండనుంది. ఇక HDFC బ్యాంక్ కార్డ్‌ల ద్వారా అదనంగా రూ. 4,000 తగ్గింపు కూడా ఉంది. మెుత్తంగా ఈ ల్యాప్‌టాప్‌ రూ. 38,999కే పొందవచ్చు. RedmiBook ప్రోపై తొమ్మిది నెలల నో-కాస్ట్ EMIని కూడా పొందవచ్చు.

Latest Videos

RedmiBook 15

256GB, 512GB SSD స్టోరేజ్ వేరియంట్‌ గల RedmiBook 15ను ఈ సేల్‌లో రూ. 6,000 తగ్గింపుకు పొందవచ్చు. ఈ  ల్యాప్‌టాప్ 11th generation ,ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్‌, , 8GB RAMని కలిగి ఉంది.  256GB స్టోరెజ్ కలిగిన ల్యాప్‌టాప్‌ ధర రూ. 32,999 ఉండగా..  512GB వేరియంట్‌ ధర రూ. 35,999కి అందుబాటులో ఉన్నాయి. HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లు రెండు వేరియంట్‌లపై రూ. 3,500 అదనపు తగ్గింపును పొందవచ్చు.

Mi నోట్‌బుక్ ప్రో

Xiaomi లెవెల్ అప్ సేల్‌లో Mi నోట్‌బుక్ ప్రో.. రెండు వేరియంట్‌లపై స్పెషల్ డిస్కౌంట్‌లు ఉన్నాయి. ఈ వేరియంట్‌లలో 11th జనరెషన్. ఇంటెల్ కోర్ i5-పవర్డ్‌ వంటి అత్యాధునికి ఫీచర్స్‌ను అందించారు. Mi నోట్‌బుక్ ప్రోలో 8GB, 16GB RAM వేరియంట్‌లు ఉన్నాయి .ఇవి రెండూ 512GB SSD-ఆధారిత స్టోరెజ్‌తో వస్తున్నాయి. Mi నోట్‌బుక్ ప్రో 8GB వేరియంట్‌పై రూ. 1,000 తగ్గింపు ఉంది, దీని ధర రూ. 55,999. 16GB వేరియంట్ ల్యాప్‌టాప్ రూ. 57,999 ధరతో రూ. 3,500 తగ్గింపుతో వస్తోంది. రెండు వేరియంట్‌లకు HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా రూ. 4,000 వరకు తగ్గింపును పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత రూ. 51,999, రూ. 53,999 ధరలో ఈ వేరియంట్‌లు లభిస్తున్నాయి.

Mi నోట్‌బుక్ అల్ట్రా

8GB, 16GB RAM గల Mi నోట్‌బుక్ అల్ట్రా వేరియంట్‌లు 512GB SSD స్టోరేజ్‌తో లభిస్తున్నాయి. ఈ ల్యాప్‌టాప్ 11th జనరెషన్, ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఆపర్‌లో Mi నోట్‌బుక్ అల్ట్రా 8GB RAM వేరియంట్‌పై రూ. 2,000 తగ్గింపు లభిస్తుండగా.. 16GB RAM వేరియంట్‌పై రూ. 5,500 తగ్గింపును పొందవచ్చు. Intel Core i7-ఆధారిత Mi Notebook Ultraకి తగ్గింపు లభించదు - అయినప్పటికీ HDFC బ్యాంక్ కార్డ్ ఆధారిత ఆఫర్‌లు వర్తిస్తాయి. 8GB RAM వేరియంట్‌ గల అల్ట్రా ల్యాప్‌టాప్ ధర రూ. 57,999 ఉండగా.. 16GB RAM వేరియంట్‌ ధర రూ. 59,999గా ఉంది. HDFC బ్యాంక్ ద్వారా అదనంగా రూ. 4,000 తగ్గింపు లభిస్తో్ంది. Mi నోట్‌బుక్ అల్ట్రాపై వరుసగా రూ. 53,999, రూ. 55,999కి కొనుగోలు చేయవచ్చు.

అదనంగా, Mi నోట్‌బుక్ అల్ట్రా  కోర్ i7 వేరియంట్‌పై రూ. 4,500 కార్డ్ తగ్గింపు లభిస్తుందని Xiaomi తెలిపింది,  ప్రస్తుతం  భారత్‌లో ఈ Mi నోట్‌బుక్ అల్ట్రా కోర్ i7   ధర రూ. 77,999 కంటే ఎక్కువగా ఉంది. ఆఫర్‌లో రూ. 73,499కి పొందవచ్చు .  తొమ్మిది నెలలకు EMI ధర రూ. 8,167గా ఉండనుంది.

click me!