మొబైల్ గేమ్స్ ఇష్టపడే గేమర్ల కోసం బ్లాక్ షార్క్ నుంచి ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ అయింది. ఇందులో అన్ని ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. మొబైల్ హీటెక్కకుండా అధునాతన టెక్నాలజీ ఉంది. మిగతా వివరాల కోసం ఈ స్టోరీ చదవండి..!
షావోమికి చెందిన మరో గేమింగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'బ్లాక్ షార్క్' నుంచి బ్లాక్ షార్క్ 5 గేమింగ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. బ్లాక్ షార్క్ 5, బ్లాక్ షార్క్ 5 ప్రో అనే రెండు స్మార్ట్‌ఫోన్లు ప్రత్యేకంగా మొబైల్ గేమర్‌లను దృష్టిలో ఉంచుకొని రూపొందించినవి. ఈ ఫోన్‌లు హీటెక్కకుండా అధునాతన యాంటీ గ్రావిటీ డ్యూయల్ VC లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ, స్ట్రక్ అవ్వకుండా అధిక రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లే, వేగవంతమైన అనుభూతికోసం మెరుగైన ర్యామ్, స్టోరేజ్‌లతో పాటు శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, పాప్-అప్ మాగ్నటిక్ ట్రిగ్గర్స్ తదితర ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ సిరీస్ లోని ఇతర వివరాలు ఎలా ఉన్నాయి.. ధర ఎంత ఈ కింద పేర్కొన్నాం.. పరిశీలించండి..!
Black Shark 5 Pro స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే
- 8GB/12GB/16GB RAM, 128/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్
- వెనకవైపు 108 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 4650 mAh బ్యాటరీ సామర్థ్యం, 120W ఛార్జర్
- 8GB ర్యామ్, 128 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర, సుమారు రూ. 62,000
- 12GB ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర, సుమారు రూ. 70,000
- 16GB ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర, సుమారు రూ. 78,000
Black Shark 5 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే
- 8GB/12GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- స్నాప్‌డ్రాగన్ 870ప్రాసెసర్
- వెనకవైపు 64 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 4650 mAh బ్యాటరీ సామర్థ్యం, 120W ఛార్జర్
- 8GB ర్యామ్, 128 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర, సుమారు రూ. 43,000
- 12GB ర్యామ్, 128 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర, సుమారు రూ. 60,000.