అన్నీ పేటీఎంతోనే: స్టే ఎట్ హోం ఎస్సెన్షియల్ పేమెంట్స్

By narsimha lode  |  First Published Apr 19, 2020, 11:10 AM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మహారాష్ట్రతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంటి దగ్గర నుంచే తమ విద్యుత్‌, వాటర్‌, ఇతర బిల్లులను పేటీఎం యాప్‌ ద్వారా సులభంగా చెల్లించవచ్చని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ వీర్ తెలిపారు. ‘స్టే ఎట్ హోమ్ ఎసెన్షియల్ పేమెంట్స్’ ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్‌ను పేటీఎం యాప్ అందిస్తున్నట్లు తెలిపారు. 


ముంబై/ హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో మహారాష్ట్రతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంటి దగ్గర నుంచే తమ విద్యుత్‌, వాటర్‌, ఇతర బిల్లులను పేటీఎం యాప్‌ ద్వారా సులభంగా చెల్లించవచ్చని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ వీర్ తెలిపారు. ‘స్టే ఎట్ హోమ్ ఎసెన్షియల్ పేమెంట్స్’ ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్‌ను పేటీఎం యాప్ అందిస్తున్నట్లు తెలిపారు. 

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్), తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎస్పీడీసీఎల్), హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్సెస్బీ) వంటి అత్యవసరాల బిల్లులను పేటీఎం యాప్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు.

Latest Videos

‘‘బిల్లులను చెల్లించడానికి సంబంధింత వెబ్‌సైట్లకు మారాల్సిన అవసరం లేకుండానే వివిధ సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా ఐకాన్ల నుంచి ఎంపిక చేసుకునే విధంగా రూపొందించాం. వినియోగదారులు తమ మొబైల్‌, డీటీహెచ్‌ రీచార్జ్‌లు, ఎలక్ట్రిసిటీ, క్రెడిట్ కార్డ్ వంటి చెల్లింపులు చేసేందుకు ఈ నూతన యాప్ ఉపయోగపడుతుంది. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునేందుకు ఆప్షన్స్ ఉన్నాయి. బీమా సేవలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక  బై ఇన్సూరెన్స్ ట్యాబ్ ఉంటుంది’ అని అమిత్ వీర్ వివరించారు.

తమ అపార్ట్ మెంట్ మెయింటెనెన్స్ బిల్లును కొద్ది నిమిషాల్లోనే చెల్లించవచ్చన్నారు. సొసైటీ / అపార్ట్ మెంట్ పే టీఎం యాప్ లో నమోదు కాకున్నా కూడా కొన్ని సరళమైన స్టెప్స్ ద్వారా చెల్లింపులు ప్రారంభించవచ్చని అమిత్ వీర్ పేర్కొన్నారు. 

also read:కరోనాతో ఉక్కిరిబిక్కిరి.. మాస్ టెస్ట్‌లు బెస్టన్న జెఫ్ బెజోస్

పేటీఎం యాప్‌ ఇంటర్‌ఫేస్‌ను పునరుద్ధరించామని.. తద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలు సులభంగా ఎసెన్సియల్‌ పేమెంట్‌ ఐకాన్‌ను చూడగలుగుతారని అమిత్ వీర్ అన్నారు. కరోనాపై సమాచారంతో పాటు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని... దీంతో వివిధ సోషల్ మీడియా వేదికల్లో అవాస్తవ సమాచారం కారణంగా తప్పుదారి పట్టకుండా ఉంటారన్నారు.

మహారాష్ట్ర వాసులు తమ ఇళ్ల నుంచి విద్యుత్, గ్యాస్, ఆరెంజ్ సిటీ వాటర్ తదితర బిల్లులు పేటీఎం యాప్ నుంచి చెల్లించొచ్చు. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్ఈడీసీఎల్), మహానగర్ గ్యాస్ (ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ అండ్ అడ్జస్టింగ్ ఏరియాస్), ఆరెంజ్ సిటీ వాటర్ బిల్లులు చెల్లించడం చాలా ఈజీ. 

డీటీహెచ్ రీచార్జీ, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడంతోపాటు యాప్ ద్వారా వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం పేటీఎం ‘స్టే ఎట్ హోం ఎస్సెన్సియల్ పేమెంట్ ఫీచర్‘ పూర్తిగా మార్పులు చేసింది. వారి బిల్లుల చెల్లింపుల కోసం సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ వెబ్‌సైట్‌కు వెళ్లకుండానే పని పూర్తి చేసేయవచ్చు.

మహారాష్ట్రలోని అపార్టుమెంట్ ప్లాట్లలో నివసిస్తున్న వారు తమ ప్లాట్ల మెయింటెనెన్స్ బిల్లులు కూడా ఈ యాప్ ద్వారా చెల్లించొచ్చు. ఇంకా పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలకు చెందిన 50 ఈ-న్యూస్ పేపర్లను కూడా యాప్ నుంచి చూసుకోవచ్చు.

click me!