బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునర్వ్యవస్థీకరణ పేరిట కేంద్రం ప్రతిపాదించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి ఉద్యోగుల నుంచి భారీగా స్పందన వస్తోంది. ప్రభుత్వం 94 వేల మందిని ఇంటికి సాగనంపాలని లక్ష్యంగా పెట్టుకుంటే నాలుగు రోజుల్లోనే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 60 వేలు దాటింది. బీఎస్ఎన్ఎల్ సంస్థలోనే దరఖాస్తులు 57 వేలను మించి పోవడం గమనార్హం.
న్యూఢిల్లీ/ ముంబై: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, దాని అనుబంధ ఎంటీఎన్ఎల్ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) పథకానికి భారీ స్పందన లభిస్తోంది. వీఆర్‌ఎస్ స్కీమ్‌నకు ఉద్యోగుల నుంచి ఊహించని స్పందన లభించిందని కేంద్రం శుక్రవారం తెలిపింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల్లో వీఆర్ఎస్ కోసం 60 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
కేవలం నాలుగు రోజుల్లో బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 57 వేల మందికి పైగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం ఉదయానికి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 40 వేలు కాగా, సాయంత్రానికి భారీగా పెరిగింది. ఇక బీఎస్ఎన్ఎల్ అనుబంధ ఎంటీఎన్‌ఎల్ 3,000 మంది ఉద్యోగులను వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేశారని కేంద్రం తెలిపింది.
undefined
also read 47 మెగాపిక్సెల్ సెన్సార్‌తో... మిర్రర్‌లెస్ కెమెరా
ఎంటీటిఎన్‌ఎల్ నుంచి 15 వేల మందికి వీఆర్ఎస్ అమలు చేయాలని నిర్ణయించగా ఇప్పటికే మూడు వేల మంది ముందుకొచ్చారని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాశ్ తెలిపారు. మొత్తం వీఆర్‌ఎస్ స్కీం 94 వేల మంది ఉద్యోగులకు వర్తింప జేయాలని తమ లక్ష్యం అని కేంద్ర టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాష్ చెప్పారు.
కేంద్రం ప్రకటించిన వీఆర్‌ఎస్ చాలా బాగా ఆలోచించిన పథకమనీ అందుకే ఉద్యోగుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని కేంద్ర టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాష్ పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ సంస్థలో 1.50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో లక్ష మంది వరకు వీఆర్ఎస్ పొందేందుకు అర్హులని కేంద్ర ప్రభుత్వం తొలుత అంచనా వేసింది.
aslo read వోడాఫోన్ రెడ్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్:20వేల వరకు బెనెఫిట్స్
బీఎస్ఎన్ఎల్ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం - 2019 ప్రకారం, బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన రెగ్యులర్, పర్మినెంట్ ఉద్యోగులు, డిప్యూ టేషన్‌పై ఇతర సంస్థల్లోకి పంపిన వారు, 50 ఏళ్ల వయసు దాటిన వారు ఈ స్కీంకు అర్హులు. 2020 జనవరి 31 నాటికి 50 ఏళ్లు, అంతకు మించిన వయస్సు గల వారు వీఆర్ఎస్ పథకానికి అర్హులు.
ఈ స్కీం నవంబర్ 4 నుంచి డిసెంబర్ 3 వరకు కొనసాగుతుంది. అర్హులైన ఉద్యోగులకు సర్వీసు పూర్తి చేసిన కాలానికి ఏడాదికి 35 రోజుల వేతనం మిగిలిన సర్వీసు కాలానికి ప్రతి ఏడాదికి 25 రోజుల వేతనాన్ని లెక్క గట్టి చెల్లిస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.