పాత కంప్యూటర్లు వాడుతున్నారా...మైక్రోసాఫ్ట్ సర్వేలో సంచలన విషయాలు...

By Sandra Ashok KumarFirst Published Dec 10, 2019, 11:46 AM IST
Highlights

పాతకాలం నాటి పర్సనల్ కంప్యూటర్ల వాడకంతో ఉత్పాదకతపై ప్రభావం పడుతున్నదని, భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతున్నాయని మైక్రోసాఫ్ట్ నిర్వహిస్తున్న సర్వేలో తేలింది. 

న్యూఢిల్లీ: పాత తరం కంప్యూటర్ల (పీసీ) వినియోగంతో సంస్థల్లో ఉత్పాదకత తగ్గుదల, భద్రతాపరమైన చిక్కులు వస్తున్నాయని టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించింది​. దక్షిణ భారత్​లో పాత కంప్యూటర్లను వినియోగిస్తున్న చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థ (ఎస్​ఎంబీ)లపై చేపట్టిన సర్వేలో పలు సంచలన విషయాలు బయటపెట్టింది.

ప్రస్తుతం అన్ని సంస్థలు టెక్నాలజీపైనే అధికంగా ఆధారపడుతున్నాయి. ఇదే అదనుగా సైబర్​ నేరాలు ఎక్కువయ్యాయి. ఎప్పటికప్పుడు కంప్యూటర్లు, సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ చేసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

also read అదిరిపోయే స్పెషల్ ఫీచర్స్ తో విపణిలోకి వివో వీ17...

ఈ తరుణంలో చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థల్లో(ఎస్​ఎంబీ) వినియోగిస్తున్న కంప్యూటర్ల విషయమై మైక్రోసాఫ్ట్ కీలక విషయాలు వెల్లడించింది మైక్రోసాఫ్ట్​ సంస్థ. ఈ సంస్థల్లోని పని ప్రదేశాల్లో ఉత్పాదకతలో క్షీణత, భద్రతలో సమస్యలు ఎదురైనట్లు గుర్తించింది. అంతర్జాతీయ ఎస్​ఎంబీ ఐటీ మార్కెట్​ పరిశోధన, విశ్లేషణ సంస్థ- టెక్​ఎస్లే భాగస్వామ్యంతో సర్వే చేపట్టింది మైక్రోసాఫ్ట్​. 

ఆసియా-పసిఫిక్​ ఖండ దేశాల్లోని సుమారు 2000 ఎస్​ఎంబీలపై మైక్రోసాఫ్ట్ సర్వే సాగింది. కొత్త కంప్యూటర్లను వినియోగిస్తున్న సంస్థలతో పోలిస్తే.. నాలుగేళ్ల క్రితం కంప్యూటర్లు, పాత తరం ఆపరేటింగ్​ వ్యవస్థల్ని​ వినియోగిస్తున్న ఎస్​ఎంబీల ఉత్పాదకత క్షీణించినట్లు సర్వే వెల్లడించింది.

కొత్త పర్సనల్ కంప్యూటర్లతో పోలిస్తే.. 4 రెట్లు ఎక్కువ సార్లు పాత వాటిని బాగు చేయించినట్లు మైక్రోసాఫ్ట్ సర్వే వెల్లడించింది. దీని ఫలితంగా సుమారు 96 గంటల పని ఉత్పాదకత సమయం నష్టపోయినట్లు వివరించింది సర్వేలో వెల్లడించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

దక్షిణ భారత్​లో ఎస్​ఎంబీల్లో సమాచార పునరుద్ధరణ​, వ్యాపారాన్ని నడిపించటం అనేది అతిపెద్ద సవాలుగా మారిందని నివేదిక వెల్లడించింది. గతేడాది దక్షిణ భారత్​లోని 25 శాతం ఎస్​ఎంబీలపై చేసిన సర్వేలో అధికంగా భద్రతా ఉల్లంఘనలకు గురయ్యాయి. 

also read గుడ్ న్యూస్ ఆ రెండు ప్లాన్లలోకి జియో రి ఎంట్రీ

సుమారు 40 శాతం సంస్థలు కాలం చెల్లిన పర్సనల్ కంప్యూటర్లను వినియోగిస్తున్నాయి. 62 శాతం సంస్థల్లో పాత తరం విండోస్​ సాఫ్ట్​వేర్​ ఉపయోగిస్తున్నారు. దక్షిణ భారత్​లోని ఎస్​ఎంబీల్లో కొత్త తరం కంప్యూటర్లను వాడిన సంస్థలు బహుళ ప్రయోజనాలు పొందినట్లు సర్వే తెలిపింది. 

కొత్త పర్సనల్ కంప్యూటర్ల వాడకంతో అధిక ఉత్పాదకత, మైరుగైన భద్రతతో సహా నిర్వహణ ఖర్చులను తగ్గించుకున్నట్లు మైక్రోసాఫ్ట్ సర్వేలో తేలింది. కొత్త పీసీలను ఉపయోగించటం ద్వారా 89 శాతం సంస్థలు ఐటీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నాయి. 75 శాతం సంస్థలు క్లౌడ్​, మొబిలిటీ​ సోల్యూషన్ల​తో కూడిన కొత్త పీసీలను తీసుకునేందుకు అంగీకరించాయి.
 

click me!