ఈ ఫోన్‌ ఉన్నవారికి Google Mapsలో రెండు కొత్త ఫీచర్స్.. ఇప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు..

By Ashok Kumar  |  First Published Jul 17, 2024, 9:29 PM IST

స్పీడోమీటర్ అనేది Google మ్యాప్స్‌లో వాహన స్పీడ్  చెక్ చేయడంలో మీకు సహాయపడే ఫీచర్. కానీ అసలు స్పీడ్ తేడా ఉండే   అవకాశం ఉన్నందున వాహనాల స్పీడోమీటర్‌తో స్పీడ్  చెక్ చేయాలని గూగుల్ సూచిస్తోంది. 


గూగుల్ మ్యాప్స్‌కి సంబంధించి రెండు కొత్త ఫీచర్లు ఇప్పుడు ఆపిల్ ఐఫోన్ (iOS) ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చాయి. ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో అందుబాటులోకి వచ్చిన ఐదేళ్ల తర్వాత ఈ ఫీచర్లను ఐఫోన్ యూజర్లకు పరిచయం చేసింది. అవే ‘స్పీడోమీటర్’ & ‘స్పీడ్ లిమిట్స్’. ఆండ్రాయిడ్ యాప్స్‌లో భారత దేశంతో సహా 40కి పైగా దేశాల్లో 2019లో ఈ ఫీచర్లు వచ్చాయి.

స్పీడోమీటర్ అనేది Google మ్యాప్స్‌లో వాహన స్పీడ్  చెక్ చేయడంలో మీకు సహాయపడే ఫీచర్. కానీ అసలు స్పీడ్ తేడా ఉండే అవకాశం ఉన్నందున వాహనాల స్పీడోమీటర్‌తో స్పీడ్  చెక్ చేయాలని గూగుల్ సూచిస్తోంది.

Latest Videos

undefined

స్పీడ్ లిమిట్స్ అనేది మీ వాహనం చాలా వేగంగా వెళ్తుంటే మిమ్మల్ని హెచ్చరించే సిస్టం. స్పీడ్ లిమిట్ దాటినప్పుడు ‘స్పీడ్ ఇండికేటర్’ కలర్ మారుతుంది. ఈ రెండు ఫీచర్లు ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్లకు రానున్నాయి. ఈ రెండింటినీ ఆన్ అండ్  ఆఫ్ టోగుల్ చేయవచ్చు. ఈ రెండు ఫీచర్లు ఐఫోన్ కాకుండా CarPlay అప్లికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి. దేశాన్ని బట్టి కిలోమీటర్లు, మైళ్లలో స్పీడ్ చూపిస్తుంది. 

గూగుల్ మ్యాప్స్ స్పీడ్‌తో పాటు కొన్ని దేశాల్లో స్పీడ్ కెమెరాలు, మొబైల్ స్పీడ్ కెమెరాలని కూడా చూపిస్తుంది. మీరు iPhoneలలో Google Maps యాప్‌లోని సెట్టింగ్స్  అప్షన్‌కి  వెళ్లి నావిగేషన్ & డ్రైవింగ్ అప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా స్పీడోమీటర్, ఇంకా స్పీడ్ లిమిట్ ఆన్ చేయవచ్చు.

click me!