Black Friday Sales:ఫోన్ కొన్నాక కస్టమర్లకు ఏం గిఫ్ట్‌ ఇస్తున్నారో తెలుసా ?

By Sandra Ashok Kumar  |  First Published Nov 27, 2019, 10:54 AM IST

 బ్లాక్ ఫ్రైడే భారతీయ మార్కెట్లో అంతగా ప్రాచుర్యం పొందనప్పటికీ, నోకియా చాలా చురుకుగా ఆఫర్లను ప్రవేశపెడుతుంది.ఈ సందర్భంగా స్మార్ట్ ఫోన్ తయారీదారి నోకియా తన స్మార్ట్ ఫోన్లపై అనేక రకాల ఆఫర్లను ప్రకటించింది.


బ్లాక్ ఫ్రైడే సంధర్భంగా అనేక బ్రాండ్లు ఆఫర్లను ప్రారంభించాయి. బ్లాక్ ఫ్రైడే భారతీయ మార్కెట్లో అంతగా ప్రాచుర్యం పొందనప్పటికీ, నోకియా చాలా చురుకుగా ఆఫర్లను ప్రవేశపెడుతుంది.ఈ సందర్భంగా స్మార్ట్ ఫోన్ తయారీదారి నోకియా తన స్మార్ట్ ఫోన్లపై అనేక రకాల ఆఫర్లను ప్రకటించింది.

also read అమెజాన్‌లో భారీ అఫర్లు.. తక్కవ ధరకే స్ట్మార్ట్ ఫోన్స్ .. కొద్ది రోజులు మాత్రమే

Latest Videos

డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉంటుందని నోకియా ఇండియా తెలిపింది. మీరు దాని గురించి తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది.అయితే నోకియా ఫోన్లను కొన్నాక కస్టమర్లు చెకవుట్ పేజీలో GIFTCARD అనే కూపన్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఫోన్ కొన్నాక కస్టమర్లకు గిఫ్ట్‌కార్డు వస్తుంది. ఈ గిఫ్ట్ కార్డ్ 30 రోజుల లోపు మరొక నోకియా ఫోన్ కొనుగోలుపై ఉపయోగించుకోవచ్చు.

also read ఈ ప్లాట్‌ఫామ్ పై ఆల్-టైమ్ హై...100 మిలియన్లు దాటిన స్నాప్‌డీల్


బ్లాక్ ఫ్రైడే  సంధర్భంగా నోకియా ఎంచుకున్న కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో 5,000 రూపాయల (సుమారు $ 70) విలువైన గిఫ్ట్ కార్డులను అందిస్తోంది. ఈ ఆఫర్లలో నోకియా 7.2, నోకియా 6.2, నోకియా 8.1, నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్, నోకియా 4.2, నోకియా 3.1 ప్లస్, నోకియా 3.2 మరియు నోకియా 2.2 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ మోడల్‌ను బట్టి గిఫ్ట్ కార్డు విలువ  ఉంటుంది. నోకియా 7.2, నోకియా 6.1 ప్లస్ మరియు నోకియా 5.1 ప్లస్‌లతో, హెచ్‌ఎండి గ్లోబల్ 5,000 రూపాయల విలువైన గిఫ్ట్ కార్డులను అందిస్తోంది. నోకియా 6.2 మినహా మిగిలిన స్మార్ట్ ఫోన్లపై రూ .2,000 గిఫ్ట్ కార్డ్ ఇస్తుంది.

click me!