ఏటా కొత్త ఐఫోన్‌ కొనాల్సిందేనా.. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఏం చెప్పారంటే ?

By Ashok KumarFirst Published Jul 20, 2024, 10:10 PM IST
Highlights

మీరు ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్‌ కొనాల్సిందేనా ? మీరు దీని గురించి ఆలోచించి ఉండకపోవచ్చు, కానీ Apple CEO టిమ్ కుక్‌ని ఈ ప్రశ్న అడిగినప్పుడు దానికిలా సమాధానం ఇచ్చాడు. 
 

టెక్ దిగ్గజం ఆపిల్ ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్‌లను లాంచ్ చేస్తుంది. ప్రతి ఏడాది కూడా దాదాపు 4 నుండి 5 ఐఫోన్ల మోడల్స్  విడుదల అవుతాయి. చాలా మంది  ప్రతి సంవత్సరం వారి ఐఫోన్‌ను మారుస్తుంటారు. మీలో చాలా మందికి ఈ అలవాటు ఉండవచ్చు, కానీ మీరు ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ కొనాలా ? మీరు దీని గురించి అంతగా ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ Apple CEO టిమ్ కుక్‌ని ఈ ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం ఇచ్చాడు. అయితే ఏం చెప్పాడో తెలుసా ?

ఆపిల్ ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్‌ను ఎందుకు లాంచ్  చేస్తుంది?
ఆపిల్ ప్రతి సంవత్సరం కొత్త ఫోన్‌ను ఎందుకు విడుదల చేస్తుందో తెలుసా..? గత ఏడాది ఒక వార్తా వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను ఈ ప్రశ్న అడిగినప్పుడు  ఇలా సమాధానమిచ్చాడు, "ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ కావాలనుకునే వారి కోసం ఇది చాలా గొప్ప విషయం."

Latest Videos

ఇంకా ఆపిల్ పాలసీ గురించి కూడా మాట్లాడాడు, ఐఫోన్ యూజర్లు వారి పాత ఐఫోన్‌ను కొత్తదానికి మార్చుకోవడానికి అనుమతిస్తుంది. మరి ఈ పాత ఫోన్‌లు ఏమవుతాయి ? ఐఫోన్ గురించి ఈ  ప్రశ్నకు, ‘అవి ఇప్పటికీ పనిచేస్తుంటే మేము ఆ ఫోన్‌లను తిరిగి విక్రయిస్తాము. ఫోన్‌లు పని చేయకపోతే ఆపిల్ వాటిని విడదీసి కొత్త ఐఫోన్‌ తయారీలో దాని భాగాలను ఉపయోగిస్తుంది’ అని టిమ్ కుక్ చెప్పారు.

click me!