ఇలా చూడొచ్చు.. అలా చూడొచ్చు.. ప్రపంచంలోనే తొలి డ్యూయల్ స్క్రీన్ ల్యాప్ టాప్ వచ్చేసింది!

By Ashok KumarFirst Published Jul 20, 2024, 9:42 PM IST
Highlights

 దీనిని సైడ్ వ్యూగా ఉపయోగించడం కూడా సులభం. ఇందులో బ్యాక్ టు బ్యాక్ మోడ్ కూడా ఉంది. దీని ద్వారా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను మీ ముందు కూర్చున్న వ్యక్తికి కూడా చూపించవచ్చు. 

మార్కెట్‌లో రకరకాల ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు  ACMagic X1 ల్యాప్‌టాప్ మార్కెట్లోకి వచ్చింది. అయితే, ఈ  ల్యాప్‌టాప్‌ డ్యూయల్ స్క్రీన్‌తో కూడిన ప్రపంచంలోనే మొట్టమొదటి ల్యాప్‌టాప్ అని కంపెనీ పేర్కొంది. ఇంకా, స్క్రీన్ 360- డిగ్రీ ఫోల్డబుల్ ఫీచర్‌తో వస్తుంది. ఒక కోణంలో దీనిని ఫ్లిప్ స్క్రీన్ అని కూడా అనవచ్చు. అలాగే, అవసరాలకు అనుగుణంగా దీన్ని సెట్ చేసుకోవచ్చు.

 దీనిని సైడ్ వ్యూగా ఉపయోగించాలనుకుంటే కూడా సులభం. ఇందులో బ్యాక్ టు బ్యాక్ మోడ్ కూడా ఉంది. దీని ద్వారా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను మీ ముందు కూర్చున్న వ్యక్తికి చూపించవచ్చు. ఆన్-స్క్రీన్ విజువలైజేషన్, గేమ్స్ ఆడటం, సినిమాలు చూడటం మొదలైన వాటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం దీని ధర గురించి వివరాలు లేవు.

Latest Videos

మార్కెట్‌లోని చాలా డ్యుయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్‌లు లేటెస్ట్ ఫీచర్లతో వచ్చినప్పటికీ, ఆ ల్యాప్‌టాప్‌లు ఒకే సైజ్ స్క్రీన్‌తో ఉండవు.  ఈ ల్యాప్‌టాప్ 12th జనరేషన్ ఇంటెల్ కోర్ i7-1255U ప్రాసెసర్‌తో వస్తుంది. Acemagic X1కి రెండు 14-అంగుళాల పూర్తి HD స్క్రీన్‌   ఉంది. ఈ ల్యాప్‌టాప్ 16GB డ్యూయల్-ఛానల్ DDR4 RAM, 1TB SSD స్టోరేజ్‌తో వస్తుంది.

కనెక్టివిటీ గురించి చెప్పాలంటే.. ఈ ల్యాప్‌టాప్‌లో రెండు USB టైప్-సీ, ఒక USB 3.0 టైప్-A, ఒక HDMI 2.0 పోర్ట్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌ని రెండు USB-C పోర్ట్‌లలో ఒకదాని సహాయంతో ఛార్జ్ చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ Wi-Fi 6, బ్లూటూత్ 5.2 సపోర్ట్‌తో వస్తుంది. అయితే, ఈ ల్యాప్‌టాప్ సేల్స్  ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై స్పష్టమైన వివరాలు లేవు.

click me!