జియో కొత్త యాప్‌: ఏడాది పాటు ఫ్రీ, ఎలా పని చేస్తుందంటే..?

By Ashok KumarFirst Published Jul 20, 2024, 9:59 PM IST
Highlights

మెటా వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా రిలయన్స్ జియో జియోసేఫ్‌ను తీసుకొచ్చింది. వీడియో కాలింగ్‌తో పాటు, జియో సేఫ్ యూజర్లు  టెక్స్ట్ మెసేజెస్ కూడా  పంపవచ్చు అలాగే ఆడియో కాల్స్ కూడా చేయవచ్చు. 

ముంబై: రిలయన్స్ జియో వాట్సాప్ లాంటి కొత్త చాట్ అప్లికేషన్‌ను లాంచ్ చేసింది. దీని పేరు జియోసేఫ్. వీడియో కాల్ చేయడానికి  ఈ యాప్ మరింత సురక్షితమైనదని, ఎక్కువ ప్రైవసీ ఉంటుందని  అని Jio పేర్కొంది. కానీ మైనస్ పాయింట్ ఏమిటంటే జియోసేఫ్ అప్లికేషన్‌ను 5G నెట్‌వర్క్‌లో మాత్రమే ఉపయోగించవచ్చు. 

మెటా వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా రిలయన్స్ జియో ‘జియోసేఫ్‌’ను తీసుకొచ్చింది. వీడియో కాలింగ్‌తో పాటు, జియో సేఫ్ యూజర్లు  టెక్స్ట్ మెసేజెస్ కూడా  పంపవచ్చు అలాగే ఆడియో కాల్స్ కూడా చేయవచ్చు. జియోసేఫ్ యాప్ Android & iOS డివైజెస్‌లకి అందుబాటులో ఉంది. జియోసేఫ్ కోసం సబ్‌స్క్రిప్షన్ ఫీజు ఒక నెలకు రూ. 199. కానీ Jio కొత్త ప్రోడక్ట్ గా మీరు మొదటి సంవత్సరం యాప్‌ను ఉచితంగా ఉపయోగించవచ్చు. ఈ యాప్ హ్యాక్ చేయలేని సురక్షితమైన యాప్ అని జియో పేర్కొంది. జియోసేఫ్ కొర్ సెక్యూరిటీగా 5  లెవెల్ సెక్యూరిటీ అందిస్తుంది. ఇది కస్టమర్ల డేటాను లీక్ చేయని సెక్యూరిటీ అని జియో పేర్కొంది. ప్రస్తుతం వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. 

Latest Videos

JioSafe యాప్ 5G నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయిన Jio SIMని ఉపయోగించే 5G స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే పని చేస్తుంది. 4G నెట్‌వర్క్‌ని ఉపయోగిస్తున్నవారు లేదా జియో సిమ్ లేనివారు ఈ అప్లికేషన్‌ను ఉపయోగించలేరు. జియోసేఫ్ యాప్ ఇప్పుడు భారతదేశంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్స్ మొదట్లో జియోసేఫ్ ప్రజాదరణను తగ్గించే అవకాశం ఉంది. జియోసేఫ్ వృద్ధి 5G నెట్‌వర్క్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల మరింత వ్యాప్తిపై ఆధారపడి ఉంటుంది. జియోసేఫ్ యాప్ వాట్సాప్‌కు ఎంత పోటీ ఇస్తుందో చూడాలి.  

click me!