మొబైల్ దిగ్గజం Xiaomi సంస్థ మరొ కొత్త మోడల్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. Redmi Note 10 Pro Max పేరుతో లాంచ్ చేసిన ఈ మెుబైల్ 108MP క్వాలిటితో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.
మంచి కెమెరా ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అయితే తక్కువ బడ్జెట్‌లో మీకు కావాల్సిన కెమెరా క్వాలిటితో Redmi Note 10 Pro Max అందుబాటులో ఉంది. 6 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ గల ఈ ఫోన్ ధర రూ. 18,999గా ఉంది. ఈ ఫోన్‌పై ఇన్‌స్టాంట్ తగ్గింపు కూడా లభిస్తోంది. రూ 2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ICICI బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లిస్తే ఈ తగ్గింపు లభిస్తోంది. ఈ Redmi ఫోన్ Mi Exchange ద్వారా రూ. 14,500కే సొంతం చేసుకోవచ్చు. ప్రధాన కెమెరా 108MP క్వాలిటిని కలిగి ఉంది. ఈ Redmi ఫోన్‌లో చాలా మంచి ఫీచర్లు అందించారు.
Redmi Note 10 Pro Max ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు
ఈ ఫోన్‌లో కంపెనీ 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల Full HD + Super AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది.ఈ డిస్‌ప్లే 1200 నిట్‌ల గరిష్ట లైటింగ్‌తో.. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రోటెక్ట్‌తో వస్తుంది. ఫోన్ గరిష్టంగా 8GB LPDDR4x RAM, 128GB UFS2.2 ఫ్లాష్ స్టోరేజ్‌తో వస్తుంది.
50MP కెమెరా, డిస్‌ప్లే, ప్రాసెసర్‌తో కూడిన అద్భుతమైన ఫోన్ 12 వేల రూపాయలలోపే వచ్చింది. ఈ Redmi ఫోన్ Snapdragon 732G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. క్వాలిటి ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో నాలుగు కెమెరాలను ఇచ్చారు. వీటిలో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌తో కూడిన 5 మెగాపిక్సెల్ సూపర్ మాక్రో కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఇన్-డిస్‌ప్లే కెమెరాను చూడవచ్చు.
ఈ ఫోన్‌లో 5020mAh బ్యాటరీని అమర్చారు. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా MIUI 12లో పని చేస్తుంది. స్ట్రాంగ్ ఆడియో కోసం ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అందించబడ్డాయి. కనెక్టివిటీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో GPS, A-GPS, Wi-Fi , 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఆప్షన్స్‌ను అందించారు.