‘మోటో రేజర్’ప్రీ-ఆర్డర్లు ఆదివారం నుంచి అమెరికాలో ప్రారంభం కానున్నాయి. భారత్‌లో ఈ ఫోన్ విడుదల తేదీపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వలేదు
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ మోటరోలా సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘మోటో రేజర్’ ను వచ్చేనెల ఆరో తేదీన మార్కెట్లో విక్రయాలకు అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. దీని ధరను 1,499 డాలర్లగా సంస్థ నిర్ణయించింది.
ప్రీ-ఆర్డర్లు ఆదివారం నుంచి అమెరికాలో ప్రారంభం కానున్నాయి. భారత్‌లో ఈ ఫోన్ విడుదల తేదీపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వలేదు. ఈ సరికొత్త మొబైల్‌ను కొనాలనుకునే వారు వెరిజోన్, వాల్‌మార్ట్, మోటొరోలా.కామ్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు.
undefined
ఈ ఫోన్ మడత సదుపాయం కలిగిన రెండు డిస్ప్లేలు కలిగి ఉంటుంది.
6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు లోపల 6.2 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, మడత పెట్టినప్పుడు బయటవైపు 2.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది.
ఫోన్ బయటవైపు ఉన్న క్విక్ వ్యూ డిస్ప్లే కెమెరాగా పని చేస్తుంది. క్విక్ వ్యూ డిస్ప్లేలో 16 ఎంపీల కెమెరా కలిగి ఉంటుంది. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఇది వెనుకవైపు కెమెరాగా మారుతుంది. ఫోన్‌ను ఓపెన్ చేసినప్పుడు లోపల మరో 5 ఎంపీ కెమెరా కూడా ఉంటుంది. అదనంగా స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
అమర్చారు.