బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రిపబ్లిక్ డే ఆఫర్‌...

By Sandra Ashok Kumar  |  First Published Jan 25, 2020, 2:34 PM IST

 భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రిపబ్లిక్ డే ఆఫర్‌ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌ లో భాగంగా రూ.1,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్  వ్యాలిడీటీ పై అదనంగా  71 రోజుల వాలిడిటీని అందిస్తుంది.


ప్రభూత్వా రంగా సంస్థ బిఎస్ఎన్ఎల్  71వ రిపబ్లిక్ డే దినోత్సవా సంధర్భంగా భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రిపబ్లిక్ డే ఆఫర్‌ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌ లో భాగంగా రూ.1,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్  వ్యాలిడీటీ పై అదనంగా   71 రోజుల వాలిడిటీని అందిస్తుంది. రిపబ్లిక్ డే ఆఫర్‌ జనవరి 26 నుండి మొదలై ఫిబ్రవరి 15 వరకు బి‌ఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకోసం అందుబాటులో ఉంచనుంది.

also read రియల్ మి స్మార్ట్ ఫోన్‌లో కొత్త ఫీచర్...వారికి మాత్రమే...

Latest Videos

undefined

రూ. 1,999 బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ సాధారణంగా 365 రోజుల వాలిడిటీ అందిస్తుంది. అయితే, తాజా ఆఫర్ 71 రోజుల అదనపు వాలిడిటీతో 436 రోజులకు పొడిగించింది.రూ. 1,999 బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో అయిన బి‌ఎస్‌ఎన్‌ఎల్ దీర్ఘకాలిక ఆఫర్లలో ఒకటి. ఈ ఆఫర్ హై-స్పీడ్ డేటా యాక్సెస్, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందించడానికి రూపొందించారు.

436 రోజుల వాలిడిటీతో రూ. 1,999 బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జనవరి 26 మరియు ఫిబ్రవరి 15 మధ్య ఎప్పుడైనా ఈ ప్లాన్ కోసం రిచార్జ్ చేసుకోవచ్చు.26 జనవరి ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అదనపు వాలిడిటీని అందిస్తున్నారు. రూ. 1,999 బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌కు 71 రోజుల అదనపు వాలిడిటీ మాత్రమే అందిస్తుంది, ప్రత్యేకంగా ఇతర ప్రయోజనాలు ఏమి ఉండవు అని తెలిపింది.

అంటే వినియోగదారులు ఆన్ లిమిటెడ్ లోకల్, ఎస్‌టి‌డి వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లతో పాటు రోజూ 3 జిబి హై-స్పీడ్ డేటాను పొందుతారు. ప్రీపెయిడ్ ప్లాన్ కి సంబంధించి పర్సోనాలైజేడ్ రింగ్ బ్యాక్ టోన్‌లకు (పిఆర్‌బిటి) యాక్సెస్‌ను అందిస్తుంది. ఆన్ లిమిటెడ్ సాంగ్స్ మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది.

also read అమెజాన్ మరో రికార్డు...ప్రపంచ దేశాలలో 50 శాతం....

బిఎస్ఎన్ఎల్-ఫోకస్డ్ బ్లాగ్ బిఎస్ఎన్ఎల్ టెలిసర్వీసెస్ రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ పెంపుపై సమాచారాన్ని తెలిపింది. తరువాత బిఎస్‌ఎన్‌ఎల్  ఒక పత్రికా ప్రకటన ద్వారా అభికారికంగా ధృవీకరించింది.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 1,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జూన్ 2018 లో  ప్రారంభించారు. ఈ ప్లాన్ ప్రారంభంలో రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను ఇచ్చింది, అయినప్పటికీ ఇది గత సంవత్సరం ఈ ప్లాన్ అప్ డేట్ చేశారు. ఇప్పుడు 3GB రోజు వారీ హై-స్పీడ్ డేటా ప్రయోజనాలను అందించడం ప్రారంభించింది.
 

click me!