వాట్సాప్ కొత్త ఫీచర్...వెంటనే డౌన్ లోడ్ చేసుకోండీ

By Sandra Ashok Kumar  |  First Published Jan 25, 2020, 5:18 PM IST

వాట్సాప్  డార్క్ మోడ్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. ఇది  త్వరలో అధికారికంగా విడుదల కానుంది. వాట్సాప్ డార్క్ మోడ్ పై కొద్ది నెలలుగా పుకార్లు వినిపిస్తునే ఉన్నాయి.


వాట్సాప్ డార్క్ మోడ్ వాట్సాప్ యాప్ సెట్టింగ్‌లలో “డార్క్” థీమ్‌గా ఆప్షన్  ఇప్పుడు కొత్తగా చూపిస్తుంది. డార్క్ మోడ్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. ఇది  త్వరలో అధికారికంగా విడుదల కానుంది. వాట్సాప్ డార్క్ మోడ్ పై కొద్ది నెలలుగా పుకార్లు వినిపిస్తునే ఉన్నాయి.

వాట్సాప్  డార్క్ మోడ్‌ను థీమ్ సెలక్షన్ ఇంటర్‌ఫేస్‌లో డార్క్ అని పిలుస్తారు. వాట్సాప్ హోమ్ స్క్రీన్, సెట్టింగుల మెను ఇప్పుడు బ్లాక్  కలర్ లో రానుంది. వాట్సాప్‌లోని డార్క్ మోడ్ ఇప్పటికే గూగుల్ ప్లే ద్వారా బీటా టెస్టింగ్ కోసం ప్రారంభమైంది. ఇది కొత్త v2.20.13 అప్ డేట్ తో వస్తుంది.

Latest Videos

also read  బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రిపబ్లిక్ డే ఆఫర్‌...

మీరు బీటా టెస్టర్ అయితే ఇంకా అప్‌డేట్ అందుకోలేక పోతే లేదా మీరు గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌లో చేరలేకపోతే లేదా మీరు డార్క్ మోడ్ ను చూడాలనుకుంటే మీరు ఏ‌పి‌కే మిర్రర్ నుండి వాట్సాప్ బీటా v2.20.13 APK ని డౌన్ లోడ్ చేసుకొవచ్చు. ఒకవేళ మీరు బీటా టెస్టర్ కాకపోతే వాట్సాప్  కొత్త డార్క్ మోడ్‌ను ప్రయత్నించాలనుకుంటే గూగుల్ ప్లే ద్వారా బీటా టెస్టర్‌గా మీరు మీ వివరాలను ఎంటర్ చేసి అలాగే వాట్సాప్ బీటా బిల్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

అప్ డేట్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు మొదట వాట్సాప్ డార్క్ మోడ్‌ను చూడకపోతే  గూగుల్ ప్లే స్టోర్ లేదా పైన ఇచ్చిన లింక్ నుండి యాప్ డిలెట్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఉంటుందని డబ్లూఏ బీటా ఇన్ఫో  తెలిపింది. మీ చాట్ హిస్టరీ బ్యాకప్ చేసిన తర్వాత మాత్రమే యాప్  డిలెట్ చేయండి.

also read రియల్ మి స్మార్ట్ ఫోన్‌లో కొత్త ఫీచర్...వారికి మాత్రమే...

వాట్సాప్‌లో డార్క్ మోడ్ లేదా డార్క్ థీమ్‌ను ప్రారంభించడం చాలా సులభం. తాజా వాట్సాప్ బీటా అప్ డేట్ డౌన్‌లోడ్ చేసి యాప్ ఓపెన్ చేయండి.మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత, స్క్రీన్ పైన ఉన్న మూడు-డాట్ మెనుపై క్లిక్ చేసి మెను నుండి సెట్టింగులను సెలెక్ట్ చేయండి.

మీరు సెట్టింగ్‌ ఓపెన్ చేశాక చాట్‌లపై క్లిక్ చేసి ఆపై థీమ్‌పై క్లిక్ చేయండి అలా చేయడం వలన మీరు థీమ్‌ను ఎంచుకునే విండో ఆప్షన్ చూపిస్తుంది.పైన చూపించిన విండోలో డార్క్ మోడ్ పై క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండీ. ఆ తరువాత డార్క్ మోడ్ ఇంటర్‌ఫేస్‌కు మారుతుంది.సిస్టమ్ సెట్టింగుల ఆధారంగా డార్క్ ఇంకా  లైట్ మోడ్ సెలెక్ట్ చేసుకోడానికి  మీరు సిస్టమ్ డిఫాల్ట్ కూడా  సెలెక్ట్ చేసుకోవచ్చు.
 

click me!