మీషో సూపర్‌స్టోర్: గ్రోసరి బిజినెస్ కి బై బై.. భారీగా ఉద్యోగాల తొలగింపు

By asianet news telugu  |  First Published Aug 27, 2022, 1:22 PM IST

దీని గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. గత ఏప్రిల్‌లో టైర్ 2 మార్కెట్‌లలో నిత్యవసర వస్తువుల కోసం కస్టమర్ల డిమాండ్‌ను తీర్చే లక్ష్యంతో మీషో ఫార్మిసోను సూపర్‌స్టోర్‌గా రీబ్రాండ్ చేసింది. 


ఇండియన్ ఈ కామర్స్ సంస్థ మీషో భారతదేశంలో గ్రోసరి బిజినెస్ మూసివేసినట్లు నివేదించింది. మీడియా నివేదికల ప్రకారం, సూపర్‌స్టోర్ పేరుతో ఉన్న ఈ సర్వీస్ భారతదేశంలోని 90 శాతానికి పైగా నగరాల్లో (నాగ్‌పూర్ ఇంకా మైసూర్ మినహా) మూసివేసింది, దీని ఫలితంగా భారీగా ఉద్యోగుల ఉద్యోగాలు పోయాయి.

మీడియా నివేదికల ప్రకారం, సంస్థ ఈ నిర్ణయం కారణంగా సుమారు 300 మంది మీషో ఉద్యోగులు  ఉద్యోగాలను కోల్పోయారు.

Latest Videos

undefined

కంపెనీ అధికారిక ప్రకటన 
దీని గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. గత ఏప్రిల్‌లో టైర్ 2 మార్కెట్‌లలో నిత్యవసర వస్తువుల కోసం కస్టమర్ల డిమాండ్‌ను తీర్చే లక్ష్యంతో మీషో ఫార్మిసోను సూపర్‌స్టోర్‌గా రీబ్రాండ్ చేసింది. 

ఏప్రిల్‌లో 150 మందికి పైగా ఉద్యోగుల తొలగింపు
ఏప్రిల్‌లో కంపెనీ గ్రోసరి బిజినెస్ ని కోర్ ప్లాట్‌ఫారమ్‌లో ఇంటిగ్రేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ఏప్రిల్‌లో కంపెనీ 150 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది, వారిలో ఎక్కువ మంది ఫార్మిసోకు చెందినవారు. దీనికి ముందు కరోనా మహమ్మారి మొదటి వేవ్ సమయంలో కూడా సోషల్ కామర్స్ ప్లాట్‌ఫాం మీషో 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.
 

click me!