వాట్సాప్ కొత్త ఫీచర్లు: గ్రూప్ అడ్మిన్ నుండి ఆన్‌లైన్ స్టేటస్ వరకు ఈ పెద్ద అప్‌డేట్స్ రానున్నాయి..

By asianet news telugu  |  First Published Aug 26, 2022, 12:05 PM IST

తాజాగా మెటా సి‌ఈ‌ఓ మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ, మేము వాట్సాప్  భద్రతను పటిష్టం చేయబోతున్నామని, దీని కోసం వాట్సాప్  చాట్‌ స్క్రీన్‌షాట్‌ ఫీచర్‌ను ఆఫ్ చేయబోతున్నామని చెప్పారు. 


మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ మొబైల్ యాప్ వాట్సాప్  ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు చేస్తూనే ఉంది. తాజాగా కంపెనీ ఎన్నో సేఫ్టీ ఫీచర్లను కూడా లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ ఒకదాని తర్వాత ఒకటి కొత్త ఫీచర్లను రూపొందిస్తోంది. తాజాగా మెటా సి‌ఈ‌ఓ మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ, మేము వాట్సాప్  భద్రతను పటిష్టం చేయబోతున్నామని, దీని కోసం వాట్సాప్  చాట్‌ స్క్రీన్‌షాట్‌ ఫీచర్‌ను ఆఫ్ చేయబోతున్నామని చెప్పారు. అంటే, ఇప్పుడు మీరు వాట్సాప్  చాట్ స్క్రీన్‌షాట్ తీసుకోలేరు. దీనితో పాటు గ్రూప్ అడ్మిన్ల పవర్‌ని పెంచే పనిలో కూడా వాట్సాప్ కసరత్తు చేస్తోంది. వాట్సాప్‌లోని ఈ ఫీచర్ల గురించి తెలుసుకుందాం...

వాట్సాప్  స్క్రీన్‌షాట్ తీయడం సాధ్యపడదు
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా వాట్సాప్ భద్రతను మరింత పటిష్టం చేయబోతున్నట్లు ప్రకటించారు. మార్క్ జుకర్‌బర్గ్ ప్రకారం వాట్సాప్ యూజర్లు ఇకపై చాట్ స్క్రీన్‌షాట్‌లను తీసుకోలేరు. అయితే, ఈ ఫీచర్ వ్యూ వన్స్ ఫీచర్ కోసం విడుదల చేయబడుతుంది, అయితే సాధారణ చాట్  స్క్రీన్‌షాట్‌లను తీసుకోవచ్చు. వాట్సాప్ ఈ ఫీచర్ గురించి WABetaInfo కూడా తెలియజేసింది. 

Latest Videos

undefined

గ్రూప్ అడ్మిన్ మెసేజ్ డిలెట్ చేయవచ్చు 
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవర్ పెంచే పనిలో ఉంది, దీని కోసం కంపెనీ ఒక ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్‌తో గ్రూప్ అడ్మిన్ గ్రూప్ నుండి ఏదైనా వాట్సాప్ మెసేజ్‌ని డిలీట్ చేయవచ్చు. ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ చేసిన యూజర్లు మాత్రమే ఆ మెసేజ్‌ను డిలీట్ చేయగలరు. వాట్సాప్ త్వరలో ఈ ఫీచర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. 

త్వరలో ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ ఆప్షన్
వాట్సాప్ ఫీచర్‌లో హైడ్ ఆన్‌లైన్ స్టేటస్ ఆప్షన్ కూడా అందుబాటులోకి రాబోతోంది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు వారి ఆన్‌లైన్ స్టేటస్ ఎవరు చూడవచ్చో, ఎవరు చూడకూడదో స్వయంగా నిర్ణయించుకోవచ్చు. అంటే వాట్సాప్ స్టేటస్ ఫీచర్ లాగానే యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు, ఇందులో Who Can See అనే ఆప్షన్ ఉంటుంది. 

click me!