మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా.. మళ్ళీ మళ్ళీ చార్జ్ చేస్తున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి..

By asianet news teluguFirst Published Aug 26, 2022, 6:29 PM IST
Highlights

మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతున్న లేదా ఫోన్ బ్యాటరీ బ్యాకప్ గురించి ఆందోళన చెందుతున్నారా... ఫోన్ బ్యాటరీకి సంబంధించిన కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మీరు ఫోన్‌ని మళ్లీ మళ్లీ ఛార్జ్ చేయడం నుండి రిలీఫ్ పొందవచ్చు.

డిజిటల్ వరల్డ్ అండ్ సోషల్ మీడియా యుగంలో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ ఇంకా కెమెరా అధికంగా ఉపయోగించడం వల్ల బ్యాటరీ కూడా త్వరగా అయిపోతుంది. అయితే మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతున్న లేదా ఫోన్ బ్యాటరీ బ్యాకప్ గురించి ఆందోళన చెందుతున్నారా... ఫోన్ బ్యాటరీకి సంబంధించిన కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మీరు ఫోన్‌ని మళ్లీ మళ్లీ ఛార్జ్ చేయడం నుండి రిలీఫ్ పొందవచ్చు. ఈ టిప్స్ మీ ఫోన్ బ్యాటరీని ఆదా చేయడానికి ఇంకా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచడానికి సహాయపడతాయి.  
 
టిప్-1
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దగా, ప్రకాశవంతంగా ఉంటున్నాయి, ఈ కారణంగా కూడా మీ ఫోన్ బ్యాటరీని త్వరగా అయిపోవచ్చు. మీరు ఫోన్ బ్రైట్ నెస్ 50 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంచడానికి ప్రయత్నించండి లేదా మీరు ఆటో-బ్రైట్‌నెస్ మోడ్‌కి కూడా సెట్ చేయవచ్చు. దీని ద్వారా మీ ఫోన్‌ ఎక్కువ బ్యాటరీని ఆదా చేస్తుంది. 

టిప్-2
ఫోన్ బ్యాటరీని సేవ్ చేయడానికి బెస్ట్ మార్గం ఫోన్‌లోని అనవసరమైన నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడం. దీంతో మీ ఫోన్‌ డిస్ ప్లేపై నోటిఫికేషన్‌లు మళ్లీ మళ్లీ చూపించవు. మీరు అవసరం లేనప్పుడు GPS లొకేషన్ కూడా ఆఫ్ చేయవచ్చు. దీని వల్ల మీ బ్యాటరీని కూడా ఆదా చేసుకోవచ్చు. 

టిప్-3
మీ ఫోన్ యాప్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రీఫ్రెష్ చేయండి. ఈ సెట్టింగ్‌తో మీ ఫోన్ స్మూత్ గా పనిచేస్తుంది ఇంకా తక్కువ బ్యాటరీని వినియోగిస్తుంది. అలాగే ఫోన్ అప్ డేట్స్ కోసం చెక్ చేస్తూ ఉండండి.

టిప్-4
బ్యాటరీ త్వరగా అయిపోకుండా ఉండేందుకు మీరు పవర్ సేవింగ్ మోడ్‌ని కూడా ఉపయోగించవచ్చు. దీని ద్వారా మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ 50 శాతం వరకు పెంచుతుంది. ఈ మోడ్‌లో ఫోన్ మీరు ఉపయోగిస్తున్న  యాప్‌ను మాత్రమే ప్రాసెస్ చేస్తుంది, కాబట్టి అనవసరమైన  యాప్స్ లేదా బ్యాక్ గ్రౌండ్ రన్నింగ్ యాప్స్ ఆటోమేటిక్ గా నిలిపివేయబడతాయి. 

టిప్-5
స్మార్ట్‌ఫోన్ కెమెరా అండ్ ఇంటర్నెట్ ఫోన్  బ్యాటరీని ఎక్కువగా వినియోగిస్తాయి. దీని కోసం మీరు అవసరం లేనప్పుడు ఇంటర్నెట్‌ను ఆఫ్ చేయవచ్చు, ఇంకా మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను చాలా పెంచుతుంది. మీరు ఫోన్‌ని  వీలైనంత వరకు ఎక్కువ వేడి అవకుండా ఉంచడానికి ప్రయత్నించండి.

టిప్-6 
మీ ఫోన్‌ని ఒరిజినల్ ఛార్జర్‌తో మాత్రమే ఛార్జ్ చేయండి. దీనితో మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా  బెటర్ గా ఉంటుంది. కెపాసిటీ కంటే ఎక్కువ పవర్ ఉన్న ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయడం మానుకోండి. ఈ కారణంగా మీ ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది, కానీ బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది ఇంకా ఫోన్ బ్యాటరీ త్వరగా డిస్చార్జ్ అవుతుంది. 
 

click me!