దేశీయ స్మార్ట్‌వాచ్‌ల తయారీదారు Maxima తాజాగా Max Pro X1 అనే సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇది పూర్తిగా మేడ్- ఇన్-ఇండియా వాచ్.
బడ్జెట్ ధరల్లోనే స్మార్ట్‌వాచ్‌లను ఉత్పత్తి చేసే దేశీయ తయారీదారు Maxima తాజాగా మరొ సరికొత్త స్మార్ట్‌వాచ్ Max Pro X1ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త Maxima Max Pro X1 స్మార్ట్‌వాచ్ చతురస్రాకారపు డయల్‌ను కలిగి ఉంది. ఈ వాచ్ మెటల్-బకిల్ స్ట్రాప్-ఆన్ మెకానిజంతోనే పనిచేస్తుంది. వాచ్‌లో ‘అడ్వాన్స్‌డ్ రియల్‌టెక్ చిప్‌సెట్’ (RTL8762CK) ఉంది. ఇది వాటర్ రెసిస్టెన్స్ కూడా. ఇందుకోసం 3ATM రేటింగ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. Maxima కంపెనీ తమ ఉత్పత్తులను క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ ద్వారా ప్రమోట్ చేయిస్తోంది.
మాక్సిమా మ్యాక్స్ ప్రో X1 ధర రూ. 1,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌వాచ్‌ను వినియోగదారులు మాక్సిమా అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఇది బ్లాక్, పింక్, గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి..?
Maxima Max Pro X1 స్మార్ట్‌వాచ్ చతురస్రాకారంలో 1.4-అంగుళాల IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 240×280 పిక్సెల్ రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. ప్యాకేజీలో భాగంగా సిలికాన్ పట్టీ ఇంకా మాగ్నెటిక్ ఛార్జర్ ఇస్తున్నారు. డిస్‌ప్లే ఇమేజ్‌ని కస్టమైజ్ చేసుకోవడానికి 100కి పైగా క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను ఎంచుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు, ఆపిల్ ఐఫోన్‌లతో కనెక్ట్ చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్‌వాచ్‌లో Spo2 మానిటర్, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ బీట్ ట్రాకింగ్ లాంటి బేసిక్ ఫీచర్లతో పాటు ఎన్నో రకాల గేమ్‌లు, రోజువారీ వ్యాయామ లక్ష్యాలను ట్రాక్ చేయగల స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది.