ఈ మోటో జి సిరీస్ ఫోన్ మోటో జి82 5జి 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో ప్రవేశపెట్టింది. ఈ మోటో ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
లెనోవో సబ్సిడరీ బ్రాండ్ మోటోరోలా (Motorola) మోటో జి82 5జి(Moto G82)ని యూరోపియన్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ మోటో జి సిరీస్ ఫోన్ మోటో జి82 5జి 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో ప్రవేశపెట్టింది. ఈ మోటో ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. మోటో జి82 5జి స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ తో వస్తుంది.
ధర అండ్ లభ్యత
మోటో జి82 5G ధర 329.99 యూరోలు అంటే దాదాపు రూ. 26,500. ఫోన్ సింగిల్ వేరియంట్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్‌తో పరిచయం చేసారు. మోటో జి82 5జి మెట్రోయిట్ గ్రే, వైట్ లిల్లీ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. భారత్‌తో పాటు పలు ఇతర దేశమార్కెట్‌లలో ఈ ఫోన్ త్వరలో విడుదల కానుంది.
undefined
స్పెసిఫికేషన్‌లు
ఆండ్రాయిడ్ 12 మోటో జి82 5జిలో ఇచ్చారు. మోటో జి82 5జి 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల పూర్తి హెచ్‌డి+ AMOLED డిస్‌ప్లే ఉంది. డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz. ఫోన్ డిస్‌ప్లే లో బ్లూ లైట్ కోసం SGS సర్టిఫికేషన్ పొందింది. Moto G82 5G స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌తో 4జిబి LPDDR4x RAMతో పనిచేస్తుంది.
కెమెరా
కెమెరా గురించి మాట్లాడితే Motorola ఈ ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలను అందించింది, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్, ఎపర్చరు f/1.8 ఉంది. దీనితో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ కూడా ఉంది. ఫోన్‌లోని రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్‌ల అల్ట్రా వైడ్ యాంగిల్, ఎపర్చరు f/2.2. మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో. కెమెరాతో AR స్టిక్కర్లు, పోర్ట్రెయిట్ మోడ్, నైట్ విజన్ వంటి ఎన్నో మోడ్‌లు ఉన్నాయి.
బ్యాటరీ
కనెక్టివిటీ కోసం, USB టైప్-C పోర్ట్‌తో పాటు Wi-Fi 802.11 a/b/g/n/ac, బ్లూటూత్ v5.1, GPS, A-GPS, LTEPP, SUPL, GLONASS, గెలీలియో, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. Moto G82 5G 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కోసం ఫోన్ IP52 రేటింగ్ పొందింది.