Airtel Recharge Plans:ఎక్కువ వాలిడిటీ కోసం ఎయిర్‌టెల్ స్పెషల్ ప్లాన్స్.. కాలింగ్, డేటాతో ఓ‌టి‌టి ఫన్ కూడా..

Ashok Kumar   | Asianet News
Published : May 14, 2022, 02:53 PM ISTUpdated : May 14, 2022, 02:56 PM IST
Airtel Recharge Plans:ఎక్కువ వాలిడిటీ కోసం ఎయిర్‌టెల్  స్పెషల్ ప్లాన్స్.. కాలింగ్, డేటాతో ఓ‌టి‌టి  ఫన్ కూడా..

సారాంశం

కరోనా మహమ్మారి నుండి చాలా మంది ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో పాటు పిల్లల చదువులు కూడా ఆన్‌లైన్‌లోనే సాగుతున్నాయి. ఈ కారణంగా ఇంటర్నెట్ నేడు మన ప్రత్యేక అవసరంగా మారింది. 

 మీకు ఎయిర్‌టెల్  ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసా.. వీటితో మీరు లాంగ్ వాలిడిటీతో ఓ‌టి‌టి ఆనందాన్ని పొందవచ్చు. కరోనా మహమ్మారి నుండి చాలా మంది ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో పాటు పిల్లల చదువులు కూడా ఆన్‌లైన్‌లోనే సాగుతున్నాయి. ఈ కారణంగా ఇంటర్నెట్ నేడు మన ప్రత్యేక అవసరంగా మారింది. ఇంటర్నెట్ లేకుండా మన చాలా పనులు అసంపూర్ణంగా ఉంటాయి.

మీరు కాలింగ్ ఇంకా ఇంటర్నెట్ కోసం ఎయిర్‌టెల్  టెలికాం సేవలను ఉపయోగిస్తున్నట్లయితే ఈ వార్త మీ కోసమే.  ఈ Airtel రీఛార్జ్ ప్లాన్‌లలో మీరు చాలా గొప్ప ప్రయోజనాలను పొందుతారు. వీటిలో ఆన్ లిమిటెడ్ కాలింగ్ అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లకు సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. అంతేకాకుండా మీరు ఈ ప్లాన్‌లతో SMS సౌకర్యం కూడా పొందుతారు. వాటి గురించి తెలుసుకుందాం -

ఎయిర్‌టెల్ రూ. 839 రీఛార్జ్ ప్లాన్
ఎయిర్‌టెల్  ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 839. ఇందులో మీరు మొత్తం 84 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఇంకా మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం ప్రతిరోజూ 2జి‌బి డేటా లభిస్తుంది. ప్లాన్‌తో మీరు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ ల సౌకర్యాన్ని కూడా పొందుతారు.

మరోవైపు మీరు అదనపు ప్రయోజనాల గురించి మాట్లాడినట్లయితే మీరు Disney Plus Hotstar మొబైల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇంకా మీరు ఈ ప్లాన్‌తో Amazon Prime వీడియో  ఒక నెల ఉచిత ట్రయల్, Airtel Xstream 84 రోజుల మొబైల్ ప్యాక్‌ కూడా పొందుతారు.

Airtel రూ. 2999 రీఛార్జ్ ప్లాన్
మీరు ఎక్కువ కాలం వాలిడిటీ కోసం ఏదైనా రీఛార్జ్ చేయాలనుకుంటే, మీరు ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఈ ప్లాన్‌తో 365 రోజుల వాలిడిటీని పొందుతారు.

Airtel  ఈ రీఛార్జ్ ప్లాన్‌లో కాల్స్ తో పాటు ప్రతిరోజు ఇంటర్నెట్ వినియోగానికి 2జి‌బి డేటా కూడా అందుబాటులో ఉంటుంది.  అలాగే మీరు ప్లాన్‌తో  ప్రతిరోజూ 100 SMSల సౌకర్యాన్ని కూడా పొందుతారు. 

ఇక అదనపు ప్రయోజనాల గురించి మాట్లాడినట్లయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్ సబ్‌స్క్రిప్షన్ 1 సంవత్సరం పాటు ఉచితంగా లభిస్తుంది. ఇంకా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఉచిత ట్రయల్ 30 రోజుల పాటు వస్తుంది.
 

PREV
click me!

Recommended Stories

OPPO Find X9: 200 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఏఐ ఫీచ‌ర్లు.. ఒప్పో నుంచి కొత్త ఫోన్
Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే