లింక్డ్ ఇన్ కొత్త ఫీచర్‌: ఫ్రెండ్లీ ఫ్రీలాన్సర్

By Sandra Ashok Kumar  |  First Published Nov 11, 2019, 3:34 PM IST

లింక్డ్ ఇన్ తన ‘ఓపెన్ ఫర్ బిజినెస్’ ఫీచర్‌ను విడుదల చేసింది. ఇది భారతీయ ఫ్రీలాన్సర్లు & చిన్న వ్యాపార యజమానులను మరింత కనుగొనగలిగేలా చేస్తుంది.


ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ ఇన్ భారతదేశంలో తన ‘ఓపెన్ ఫర్ బిజినెస్’ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం జూలై నుండి యుఎస్ లో  ఉన్నట్లుగా, ఇండియన్  ఫ్రీలాన్సర్లు మరియు చిన్న వ్యాపార యజమానులు తమ సేవలను వారి లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లకు జోడించడానికి ఇది అనుమతిస్తుంది.

also read  సర్వీసులపై ఎఫెక్ట్ పడొద్దు.. బీఎస్ఎన్ఎల్‌కు టెలికంశాఖ అడ్వైజ్ 

Latest Videos

undefined


లింక్డ్ ఇన్ మాట్లాడుతూ ఈ  కొత్త ఫీచర్ సర్వీసు ప్రొవైడర్ల యొక్క సెర్చ్ ఇంజిన్‌లో కావల్సిన సమాచార సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రజలు ఇప్పుడు వారికి అవసరమైన ఖచ్చితమైన సేవల కోసం ఫిల్టర్ చేయగలుగుతారు.

ఏ సర్వీసు ప్రొవైడర్లు అందుబాటులో ఉన్నారో వారి వృత్తిపరమైన అవసరాలను తీర్చడానికి ఇది వారికి సహాయపడుతుంది. ప్రజలు అందించే సేవల పూర్తి జాబితాను కూడా బ్రౌజ్ చేయవచ్చు ఇంకా  సర్విస్ వారికి ప్రత్యక్ష సందేశాన్ని కూడా పంపవచ్చు.

also read  బీవేర్ ఆన్ వాట్సాప్: వాట్సాప్ గ్రూపు అడ్మిన్‌ బీ అలర్ట్


ఇది అప్ డేట్ చేయాలంటే ఎలా:

మొబైల్ యాప్ లేదా డెస్క్‌టాప్ నుండి వారి ప్రొఫైల్ పేజీని క్లిక్ చేయాలి. ఈ ఫీచర్ ఆన్ చేయబడితే వారు మీ ప్రొఫైల్ ఫోటో / హెడ్‌లైన్ క్రింద ఉన్న చిన్న బాక్స్ చూడాలి. అది మీరు అందించే సేవలను ఎలా ప్రదర్శించాలో  మీకు తెలియచేస్తుంది.


“యాడ్ సర్వీసెస్” క్లిక్ చేసి ఆపై మీరు అందించే సేవలు, సేవల గురించి వివరాల ఫారమ్‌ను పూరించండి. సాధ్యమైనంత వివరంగా ఉండండి, కాబట్టి ఈ విభాగాన్ని చూసే వారికి మీరు అందించే వివరాలు మంచి అవగాహన ఉంటుంది.
 

click me!