వాట్సాప్ ఇపుడు మరింత సేఫ్టీగా.. వచ్చేసింది కొత్త సెక్యూరిటీ ఫీచర్..

By Ashok KumarFirst Published Jul 10, 2024, 5:10 PM IST
Highlights

ఇటీవల కాలంలో వాట్సాఫ్ మోసాలు కూడా పెరిగిపోయాయి. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేందకు వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. 

 సోషల్ మీడియాలో  మనకు తెలియకుండానే  కొందరు మనల్ని వాట్సాప్ గ్రూప్‌లోకి యాడ్ చేస్తుంటారు. కొన్ని గ్రూప్స్ లోకి  మనకి తెలియని వారు కూడా మనల్ని యాడ్ చేస్తుంటారు. దీని వల్ల ఆందోళన పడుతుంటారు. అంతేకాదు వాట్సాప్‌లో గుర్తు తెలియని గ్రూపుల్లో యాడ్‌ అయ్యాక  మోసాలకు గురవుతున్న వారు కూడా ఉన్నారు. దీనికి పరిష్కారంగా  వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చేసింది. 

Latest Videos

కొత్త సిస్టమ్ ఏమిటంటే, ఎవరైనా మనల్ని వాట్సాప్ గ్రూప్‌లో చేర్చిన తర్వాత, ఆ గ్రూప్‌లోకి చేరే  ముందు గ్రూప్‌కు సంబంధించిన పూర్తి  సమాచారాన్ని చూడవచ్చు. గ్రూప్ పేరు ఏమిటి, మనల్ని గ్రూప్‌లో ఎవరు చేర్చారు, ఎవరు ఈ గ్రూప్‌ని ప్రారంభించారు ఇలాంటి సమాచారం యూజర్‌కు అందుబాటులో ఉంటుంది. మన కాంటాక్ట్‌లో లేని వారు ఎవరైనా గ్రూప్‌లో యాడ్ అయ్యారో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. మీకు తెలియని వారు ఎవరైనా మిమ్మల్ని గ్రూప్ లోకి యాడ్ చేస్తే ఎగ్జిట్  అప్షన్  కూడా మీకు కనిపిస్తుంది. ఈ కొత్త ఫీచర్‌ని వాట్సాప్ కాంటెక్స్ట్ కార్డ్ అంటారు.  

ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ కాంటెక్స్ట్ కార్డ్‌ ఫీచర్  అందుకుంటున్నట్లు  సమాచారం. కొత్త ఫీచర్ రాబోయే వారాల్లో మరిన్ని డివైజెస్లోకి  అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌లో సెక్యూరిటీ పెంచడంలో భాగంగా మెటా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వాట్సాప్‌లోని కొత్త ఫీచర్ క్రిప్టోకరెన్సీ, జాబ్ స్కామ్‌ల వంటి బారిన  పడకుండా  ఉండటానికి యూజర్లకు  సహాయపడుతుందని నమ్ముతారు. అంతేకాదు తాజగా వాట్సాప్ మరెన్నో ఇతర ఫీచర్లను ప్రవేశపెట్టింది. 

click me!