అంబానీ ఇంట పెళ్లికి పలువురు ప్రముఖులు ముంబై రానున్నారు. మరి వీళ్లందరు ఉండేందుకు స్టార్ హోటల్స్ కావాలి. ముంబైలోని హోటళ్లు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాయి, ముఖ్యంగా పెళ్లి మండపానికి సమీపంలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని (బికెసి) రెండు ఫ్లాగ్‌షిప్ హోటళ్లు రేట్లను అమాంతం పెంచాయి.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, బిలియనీర్ ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ జూన్ 12న పెళ్లి చేసుకోనున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకలు వరుసగా మూడు లేదా నాలుగు రోజుల పాటు ఉంటాయి.
ఈ పెళ్లి కార్యక్రమానికి పలువురు ప్రముఖులు రానున్నారు. మరి వీళ్లందరు ఉండేందుకు స్టార్ హోటల్స్ కావాలి. ముంబైలోని హోటళ్లు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాయి, ముఖ్యంగా పెళ్లి మండపానికి సమీపంలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని (బికెసి) రెండు ఫ్లాగ్‌షిప్ హోటళ్లు రేట్లను అమాంతం పెంచాయి. అయితే, అవి ఇప్పటికే పూర్తిగా బుక్ అయ్యాయి కూడా.
జూలై 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇక్కడ హోటళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అవును, సాధారణంగా ఇక్కడ రాత్రికి హోటల్ రెంట్ రూ. 13,000. కానీ ఈ హోటళ్లు అంబానీ పెళ్లి తేదీల్లో ఒక్క రాత్రికి ధర రూ.91,350గా నిర్ణయించాయి.
ట్రావెల్ & హోటల్ వెబ్‌సైట్‌ల ప్రకారం, ట్రైడెంట్ BKCలో గది ధరలు చాలా మారుతూ ఉంటాయి. 10,000 ఉన్న రెంట్ జూన్ 15 నాటికి 17,000కి చేరుకున్నాయి. Sofitel BKC రేట్లు జూలై 9న రూ.13,000 ఉంటె జూలై 14న రూ.91,350కి పెరిగాయి. గ్రాండ్ హయత్, తాజ్ శాంతాక్రూజ్, తాజ్ బాంద్రా, సెయింట్ రెజిస్ వంటి ఇతర ఫైవ్ స్టార్ హోటళ్లు కూడా రేట్లను పెంచాయి.
హాస్పిటాలిటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, హై-ప్రొఫైల్ పెళ్లిళ్లు, ఈవెంట్‌ల సమయంలో హోటళ్లు రేట్లు పెంచడం సహజం. ఈ ట్రెండ్ అక్టోబరు నుండి డిసెంబరు వరకు ఢిల్లీలో జరిగే వివాహాల సీజన్, బెంగుళూరులో జరిగే ఏరో షో వంటి ఈవెంట్‌ల వరకు విస్తరించింది. ఈ ఈవెంట్స్ హోటల్ ఆక్యుపెన్సీని ప్రభావితం చేయడమే కాకుండా విమాన ఛార్జీలు, రవాణా ఖర్చులను కూడా పెంచుతాయి.
ట్రాఫిక్ ఆంక్షలు
అనంత్ అంబానీ & రాధిక మర్చంట్ పెళ్లి కారణంగా ముంబై ట్రాఫిక్ పోలీసులు జూలై 12 నుండి 15 వరకు BKC కోసం ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. Jio వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కి వెళ్లే అన్ని రోడ్లు మధ్యాహ్నం 1 నుండి అర్ధరాత్రి వరకు నిషేదించారు. చాలా కంపెనీలు ఈ రోజుల్లో ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతించాయి.