ఈ జియో రీఛార్జ్ ప్లాన్‌లతో ఒకటి లేదా రెండు కాకుండా కంపెనీ 20GB వరకు ఫ్రీ హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌లు ఏంటి, వీటి ధర ఎంత ? ఇప్పుడు చూద్దాం...
ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలు పెంచి యూజర్లకు షాక్ ఇచ్చింది రిలయన్స్ జియో. ఈ రీఛార్జ్ ప్లాన్ ధరల పెంపుతో మీరు సంతోషంగా లేకుంటే మీ కోపాన్ని పోగొట్టేందుకు జియో రెండు గొప్ప ప్లాన్‌లతో ఫ్రీ డేటాను అందిస్తోంది.
ఈ జియో రీఛార్జ్ ప్లాన్‌లతో ఒకటి లేదా రెండు కాకుండా కంపెనీ 20GB వరకు ఫ్రీ హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌లు ఏంటి, వీటి ధర ఎంత ? ఇప్పుడు చూద్దాం... ఈ ప్లాన్‌ల ధర రూ. 749 & రూ. 899. ఈ రెండు ప్లాన్‌లు ఆన్ లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్స్ అందిస్తాయి.
జియో 749 ప్లాన్ వివరాలు
రిలయన్స్ జియో రూ. 749 రీఛార్జ్ ప్లాన్‌తో కంపెనీ ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా ఆన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలు అందిస్తుంది. ఈ ప్లాన్ 72 రోజులు వాలిడిటీ, మొత్తం 144GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అంతే కాకుండా, ఈ ప్లాన్ మీకు 20 GB ఫ్రీ డేటాను కూడా ఇస్తుంది, అంటే మీరు ఈ ప్లాన్‌తో మొత్తం 164 GB డేటా బెనిఫిట్ పొందవచ్చు.
జియో 899 ప్లాన్ వివరాలు
జియో ప్రీపెయిడ్ ప్లాన్ రూ.899తో మీరు ప్రతిరోజూ 2GB హై స్పీడ్ డేటా పొందుతారు. ఈ ప్లాన్ 90 రోజుల వాలిడిటీ ఉంటుంది, ఈ ప్లాన్ ప్రకారం మొత్తం 180 GB హై-స్పీడ్ డేటా, అయితే చెప్పినట్లుగా, కంపెనీ ఈ ప్లాన్‌తో అదనంగా 20 GB డేటాను అందిస్తోంది, కాబట్టి రూ. 899 ప్లాన్‌తో మీరు మొత్తం 200 GB డేటా బెనిఫిట్ పొందుతారు.
ఉచిత డేటాతో పాటు మీరు ఏదైనా నెట్‌వర్క్‌కి అం లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSల బెనిఫిట్ పొందుతారు. ఇతర బెనిఫిట్స్ చూస్తే ఈ ప్లాన్ Jio TV, Jio సినిమా, Jio క్లౌడ్‌కి ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తుంది.