టెలికం రంగంలో సంచలనాలు నెలకొల్పిన రిలయన్స్ జియో తన రెవెన్యూ, లాభాలను పెంచుకోవడంపై కేంద్రీకరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తాజాగా జియో ఫైబర్ పేరిట కేబుల్ నెట్ వర్క్‌లో ప్రవేశించిన జియో ఫైబర్ వినియోగదారులకు నిర్ధిష్ఠ కాలం ఫ్రీ ఫైబర్ సేవలందించింది. గడువు ముగిసిపోవడంతో ఖాతాదారులకు వారి ప్లాన్లకు అనుగుణంగా చార్జీలు వడ్డిస్తోంది.
కోల్‌కతా: రిలయన్స్ జియో ఫ్రీ ఫైబర్‌కు గడువు తీరిపోయింది. జియో ఫైబర్ యూజర్లు ఇన్ని రోజులు పొందిన ఉచిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు కంపెనీ బైబై చెప్పేసింది. చార్జీల బాదుడు మొదలుపెట్టింది.ట్రిపుల్ ప్లేకు సంబంధించి హోమ్ బ్రాడ్‌బ్యాండ్ పాత, కొత్త కస్టమర్లకు చార్జీలు విధిస్తున్నట్టు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తెలిపింది. తన రెవెన్యూ, లాభాలను పెంచుకోవడానికి జియో ఈ నిర్ణయం తీసుకున్నది.
‘మెట్రో మార్కెట్లలో రూ.2,500 రీఫండబుల్ డిపాజిట్ కట్టిన జియో ఫైబర్ కస్టమర్లందరూ ఇక నుంచి చార్జీలు భరించాల్సి ఉంటుంది. ప్యాన్ ఇండియా బేసిస్‌లో కమర్షియల్ బిల్లింగ్ కొన్ని వారాల్లో ప్రారంభమవుతోంది’ అని ఈ విషయం తెలిసిన ఓ జియో ఫైబర్ అధికారి చెప్పారు.
also read వాయిస్ వైఫైతో కాల్ డ్రాప్స్‌కు తెర.. ఈ ఏడాదిలోనే
సెప్టెంబర్‌లో కమర్షియల్ లాంచ్ కావడానికి ముందే ఐదు లక్షల మంది యూజర్లు జియోఫైబర్ ట్రయల్స్‌కు సైనప్ అయ్యారని ముకేశ్ అంబానీకి చెందిన టెల్కో అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ దశల వారీగా ఈ నెలలో ముగియనుంది. ట్రయల్స్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు పొందుతున్న ప్రస్తుత కస్టమర్లకు ఉచిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ముగుస్తున్నాయి.
వీరు జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను కొనసాగించాలనుకుంటే, జియో ఫైబర్ ప్లాన్స్‌లోకి మారాల్సి ఉంటుందని మరో అధికారి పేర్కొన్నారు. జియోఫైబర్ టారిఫ్ ప్లాన్స్ నెలకు రూ.699 నుంచి రూ.8,499 మధ్యలో ఉన్నాయి. జియో ఫైబర్ 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ మధ్యలో స్పీడ్ అందిస్తోంది. గేమింగ్, హోమ్ నెట్‌వర్క్ షేరింగ్, టీవీ వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్, డివైజ్ సెక్యురిటీ వంటి సర్వీసులను ఈ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి.
రిలయన్స్ జియో ఫైబర్ కంపెనీకి ఉన్న మార్కెట్ ఎగ్జిక్యూషన్, డిస్ట్రిబ్యూషన్, రిటైల్ ఫుట్‌ప్రింట్‌తో జియో బ్రాడ్‌బ్యాండ్ యూజర్ బేస్ రెండేళ్లలో కోటికి చేరుకోనుందని గ్లోబల్ రేటింగ్ సంస్థ ఫిచ్ డైరెక్టర్ నితిన్ సోని చెప్పారు. ప్రస్తుతం జియోకు 7 లక్షల మంది యూజర్లు ఉంటారని అంచనా. ఇదిలా ఉంటే రిలయన్స్ జియో ఫోన్ వినియోగదారుల చార్జీలు గురువారం అర్ధరాత్రి నుంచి పెరుగనుండటం గమనార్హం.
also read బీఎస్ఎన్ఎల్ & ఎంటీఎన్ఎల్ వీఆర్ఎస్ పథకానికి ఫుల్ డిమాండ్
సన్ నెక్ట్స్‌తో జియో బంధం
రిలయన్స్ జియో తన కంటెంట్‌ను పెంచుకుంటూ పోతున్నది. తాజాగా తన సినిమా వినియోగదారుల కోసం సన్ నెక్ట్స్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. తద్వారా సన్ నెక్ట్స్ లైబ్రరీలోని 4,000లకు పైగా దక్షిణ భారత చలన చిత్రాలను జియో వినియోగదారులు వీక్షించవచ్చు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీక్షకులకు ఈ కంటెంట్ మరింత ఆనందాన్నిస్తుందని జియో ఒక ప్రకటనలో తెలిపింది.జియో సినిమాలో ఇప్పటికే 10 వేలకు పైగా సినిమాలు, లక్షకు పైగా టీవీ ఎపిసోడ్లు, ఒరిజినల్స్‌తో వాస్ట్ కంటెంట్ అందజేస్తున్నది. సన్ నెక్ట్స్‌తో కుదుర్చుకున్న తాజా ఒప్పందంతో అది మరింత విస్తరించనున్నది.